చామంతి పూల సాగులో తెగుల నివారణ కోసం చర్యలు..!

చామంతి పూల సాగులో తెగుల నివారణ కోసం చర్యలు!

చామంతి పూల( Chamanti Flowers ) సాగుకు శీతాకాలం చాలా అనుకూలంగా ఉంటుంది.

చామంతి పూల సాగులో తెగుల నివారణ కోసం చర్యలు!

జూన్ లేదా జూలై మాసాలలో చామంతి మొక్కలు నాటుకోవాలి.నవంబర్ నెలలో పూలు కోతకు వస్తాయి.

చామంతి పూల సాగులో తెగుల నివారణ కోసం చర్యలు!

ఎటువంటి శుభకార్యానికైనా చామంతి పూలనే ఉపయోగిస్తారు కాబట్టి ఏడాది పొడవున మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.

నవంబర్లో పూల కోతలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మొక్కల యొక్క కొమ్మలు కత్తిరింపులు జరగాలి.

అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. """/" / ఇక ఉదజని సూచిక 6 నుంచి 7 వరకు ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఒక ఎకరానికి 60 వేల మొక్కలను 20 నుంచి 30 సెం.మీ దూరంలో నాటుకోవాలి.

20 రోజులకు ఒకసారి క్రిమిసంహారిక మందులతో పిచికారి చేస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.

పంట మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటిలో 100 పీపీఎం నాఫ్తాలిక్ ఎసిటిక్ ఆమ్లం( Ppm Naphthalic Acetic Acid ) 100 మిల్లీ గ్రాములు కలిపి పిచికారి చేస్తే పువ్వుల పరిమాణం బాగా పెరిగే అవకాశం ఉంది.

చామంతి పూలను ఆశించే తెగులు ఏమిటో.? వాటిని ఎలా గుర్తించి నివారించాలో తెలుసుకుందాం.

వేరుకుళ్ళు తెగులు భూమిలో అధికంగా తేమ ఉంటే చామంతి చెట్ల వేర్లకు వేరుకుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంది.

ఈ తెగులు సోకితే లేత మొక్కలు ఎండిపోయి చనిపోతాయి.కాబట్టి సకాలంలో పంటను గమనిస్తూ ఏవైనా చెట్లు ఎండిపోతునట్లు అనిపిస్తే లీటరు నీటిలో 3గ్రా.

కాపర్ ఆక్సి క్లోరైడ్( Copper Oxychloride ) కలిపి తెగులు సోకిన మొక్క పాదుల చుట్టూ నేలపై పోయాలి.

"""/" / ఆకుమచ్చ తెగులు: ఆకుల మీద గుండ్రటి గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, చుట్టూ ఎరుపు వర్ణం మధ్యలో తెల్లగా ఉంటే ఆకుమచ్చ తెగులుగా నిర్ధారించుకోవాలి.

ఈ తెగుల నివారణకు లీటరు నీటిలో 2.5 గ్రా.

మాంకోజెబ్ కలిపి పిచికారి చేయాలి.ఒకవేళ తెగుల ఉదృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో 3గ్రా.

ఆక్సి క్లోరైడ్ కలిపి పంటకు పిచికారి చేయాలి.

పూజ గదిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో…. మరోసారి వార్తల్లో నిలిచిన కుమారి ఆంటీ!