అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి:ఎన్ఎస్ యుఐ

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ):జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూల్ చేస్తూ, పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలను గుర్తించి, వాటి గుర్తింపు రద్దు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు మంగ ప్రవీణ్( Manga Praveen ) డిమాండ్ చేశారు.

గురువారం ఎన్ఎస్ యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఏవో జగన్ మోహన్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు వారి ఇష్టానుసారంగా వివిధ పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పాఠ్యపుస్తకాలు,ఇతర వస్తువులను అధిక ధరలకు విద్యార్థి తల్లిదండ్రులను బెదిరించి విక్రయిస్తున్నారని ఆరోపించారు.

దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి,చట్ట విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలపై ప్రత్యేక నిఘా పెట్టి,వసూళ్లకు పాల్పడిన పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు( Surupanga Chandu ),జిల్లా కార్యదర్శి ఎండి.

మసూద్, అసెంబ్లీ అధ్యక్షుడు బోల్లేపల్లి వినయ్, భువనగిరి మండల అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్, పట్టణ కార్యదర్శులు ఎండి.

అసద్,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

లైంగిక వేధింపుల కేసు .. కెనడాలో భారతీయ విద్యార్ధి అరెస్ట్ , ఒంటరి మహిళలే టార్గెట్