అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న క్రషర్ పై చర్యలు తీసుకోవాలి..చీటీ ఉమేష్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో డబల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఐదు సంవత్సరాలు పూర్తయిన కూడా ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు.

అలాగే శాంభవి క్రషర్ లో అక్రమ మైనింగ్ క్రషర్ గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా క్రషర్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా ఆయన జిల్లెల్ల గ్రామంలో డబల్ బెడ్ రూమ్ లను, క్రషర్ ను శనివారం నాయకులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుప్రక్కల ఉన్న మూగజీవాలకు,పంట పొలాలు భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని, క్రషర్ చేసిన బ్లాంబు బ్లాస్టింగ్ వలన గ్రామంలోని ఇల్లు ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉందన్నారు.

దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అలాగే ఇదే గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాల పక్కనే ఈ క్రషర్ ఉందని దీనివల్ల విద్యార్థులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అలాగే గ్రామ ప్రజలకు ముప్పు ఉందని తక్షణమే ఈ క్రషర్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసరి బాలరాజు యాదవ్, ఓరుగంటి తిరుపతి, ఎడమల భూపాల్ రెడ్డి, మహిపాల్, చుక్క శేఖర్, కాంగ్రెస్ యూత్ నాయకులు చోటు,ప్రశాంత్, శ్రీనివాస్ రెడ్డి, అజయ్, లింగారెడ్డి,కటికం రాజశేఖర్, నరేష్ యాదవ్,నర్రా బాల్రెడ్డి, నరేష్ యాదవ్,ఎండి సర్దార్ ఖాన్,ముండెల్లి దేవయ్య, జిల్లెల్ల గ్రామ ప్రజలు,రైతులు బాధితులు తదితరులు పాల్గొన్నారు.

మేడం టుస్సాడ్స్ లో చరణ్ మైనపు విగ్రహం.. సంతోషంలో మెగా ఫ్యాన్స్?