అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేశారు.

అడ్మిషన్ ఫీజులు కూడా అధికంగా తీసుకోవడం కొన్ని పాఠశాలలు జరుగుతుందని డిఇఓ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.

కొన్ని పాఠశాలలో బుక్స్, స్కూల్ డ్రెస్సులు అమ్మడం జరుగుతుందని ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

కొన్ని పాఠశాలలో ప్లే గ్రౌండ్ లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

సందర్భంగా డీఈవో అటువంటి పాఠశాలలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారని వారు తెలిపారు .

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్, డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్,మండల అధ్యక్షుడు మట్ట నరేష్ తదితరులు పాల్గొన్నారు.

బాలయ్య షోలో కన్నీళ్లు పెట్టుకున్న సూర్య.. ఏం జరిగిందంటే?