చేసిన నేరానికి పడిన శిక్షకు ఇంత వ్యత్యాసమా? సరికాదంటన్న జేపి

చేసిన నేరానికి పడిన శిక్షకు ఇంత వ్యత్యాసమా? సరికాదంటన్న జేపి

రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా ఉందని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ(Jayaprakash Narayan ) అభిప్రాయపడ్డారు.

చేసిన నేరానికి పడిన శిక్షకు ఇంత వ్యత్యాసమా? సరికాదంటన్న జేపి

పార్లమెంట్ అధికారులు ఈ వ్యవహారంలో అత్యుత్వాహం ప్రకటించినట్లుగా కనిపిస్తుందని ఆయన అన్నారు.

చేసిన నేరానికి పడిన శిక్షకు ఇంత వ్యత్యాసమా? సరికాదంటన్న జేపి

ఈ విషయం లో కొంత సంయమనం పాటించి ఉండాల్సింది అని న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది అని ఆయన అభిప్రాయ పడ్డారు .

కోర్టు తీర్పుతో అనర్హుడుగా ప్రకటించి ఉంటే అర్థం ఉందని కేవలం చిన్న చిన్న కారణాల కు అనర్హత ఆయుధాన్ని ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం( Democracy ) పలుచనైపోతుందని కీలక నాయకులను ఇలాంటి కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉంచాలని ప్రయత్నం చేయటం అధికార పార్టీ కి కూడా అంత మంచిది కాదని ఆయనకి హితవు చెప్పారు.

"""/" / ఒక కులం పేరు చెప్పి ఒక మతం పేరు చెప్పి ఒక ఇంటి పేరు చెప్పి వ్యక్తులను విమర్శించడం మంచి పద్ధతి కాదని ఈ విషయం లో రాహుల్ ది తప్పే అని అయితే దీనికి ఈ స్థాయి బహిష్కరణ అన్నది సబబు కాదనిఆయన అన్నారు .

చిన్న చిన్న కారణాలకి ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటే అసలు భారత రాజకీయాల్లో 90 శాతం మంది అనర్హులేనని, బాజాపా ప్రభుత్వంలోని చాలామంది ప్రజాప్రతినిధులు కూడా అనేక విషయాల్లో నోరు పారేసుకున్నారని వీటన్నిటికి పై కోర్టుకెక్కితే పోటీ చేయడానికి ఎవరికీ అర్హత ఉండదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు .

దీనిపై హైకోర్టులో అప్పిలు కి వెసులుబాటు రాహుల్ గాంధీకి( Rahul Gandhi ) ఉందని అక్కడ శిక్ష తగ్గిస్తే ఆ నిషేధం కూడా ఎత్తివేస్తారని ఆయన తెలిపారు.

"""/" / రాహుల్ గాంధీ పై అనర్హత వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా ?అని అడిగిన ప్రశ్నకు సమాదానం గా కచ్చితంగా చూపిస్తుందని ప్రజలు అన్నీ గమనిస్తుంటారని సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తుంటారని ఇప్పుడు కచ్చితంగా రాహుల్ గాంధీ విషయం బిజెపిపై ప్రభావం చూపిస్తుందని ఆయన తెలిపారు.

ఇంతకుముందు కూడా జయలలిత లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారిపై అనర్హత వేటు పడిందని కానీ వాటి వెనుక చాలా బలమైన కారణాలు కూడా ఉన్నాయని కానీ రాహుల్ గాంధీ విషయo వాటి తో పోల్చలేమంటూ ఆయన చెప్పుకొచ్చారు .

షారూక్ ఖాన్ ఇంటి అద్దె ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏకంగా అన్ని లక్షలా?

షారూక్ ఖాన్ ఇంటి అద్దె ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఏకంగా అన్ని లక్షలా?