ఒకవైపు నటిగా సినిమాలు మరోవైపు టిఫిన్ బండి బిజినెస్.. ఈ నటి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
సాధారణంగా సినిమాలలో నటించే నటీనటులు ఇంటి పనులు చేయడానికి ఇష్టపడరు.సెలబ్రిటీల ఇళ్లలో ప్రతి చిన్న పనిని పనివాళ్లే చేస్తారనే సంగతి తెలిసిందే.
అయితే ఒక నటి మాత్రం ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు టిఫిన్ బండి బిజినెస్ నడుపుతోంది.
తాజాగా ఒక నటి రోడ్డుపై టిఫిన్ బండి నడుపుతూ హాట్ టాపిక్ అయ్యారు.
ఈ నటి పేరు గీత( Actress Geetha ) కావడం గమనార్హం. """/" /
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంకు చెందిన గీత సినిమాలు, సీరియళ్లలో నటిస్తున్నా టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు.
నకిరేకల్ లో ఉన్న థియేటర్ల నుంచి సౌండ్స్ విన్నప్పుడు స్క్రీన్ పై కనిపించాలనే ఆశ కలిగిందని ఆ తర్వాత వేర్వేరు యాప్స్ వాడి నటనను మెరుగుపరచుకున్నానని ఆమె పేర్కొన్నారు.
కొంతమంది పరిచయం వల్ల సినిమా రంగంలో ఛాన్స్ వచ్చిందని గీత చెప్పుకొచ్చారు. """/" /
ఈ నటి పలు సీరియళ్లలో సైతం నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.
గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాలో సైతం ఈ నటి నటిస్తున్నారు.
ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు టిఫిన్ బండి నడుపుతున్న గీత కష్టానికి ఫిదా కావాల్సిందేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గీత కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
గీత టాలెంట్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.స్టార్స్ సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తే ఈ నటి కెరీర్ మరింత పుంజుకుంటుందని చెప్పవచ్చు.
గీత రెమ్యునరేషన్ ( Remuneration )ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.గీత అంచెలంచెలుగా ఎదుగుతూ తన సక్సెస్ స్టోరీతో ప్రశంసలు అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
భగవంత్ కేసరి సినిమాలో సైతం ఈ నటి కీలక పాత్రలో నటించారని తెలుస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తే ఈ నటి కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
చీకటి పడితే ఆ కోరిక తీరాల్సిందే… మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి?