వైరల్‌ : ఒక బట్టల షాప్‌ సేల్స్‌ను అమాంతం పెంచేసిన గోమాత, చూసిన తర్వాత నోరు వెళ్లబెట్టడం ఖాయం

కొన్ని జంతువులకు మరియు మనుషులకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కుక్కలను ఇష్టంతో చాలా మంది పెంచుకుంటారు.సిటీల్లో కుక్కలను పెంచుకుంటే పల్లెటూర్లలో కుక్కలతో పాటు ఆవులను కూడా పెంచుకుంటారు.

కొందరు ఆవులను తమ ఇంట్లో ఒక వ్యక్తిగా చూసుకుంటారు.ఆవులు చాలా మృదు స్వభావంతో ఉంటాయి.

హిందువులు ఆవులను గోమాతా అంటూ సంభోదిస్తు కొన్ని సందర్బాల్లో పూజలు కూడా నిర్వహిస్తారు.

అలాంటి ఒక గోమాత వల్ల ఒక షాపు ఇప్పుడు కళకళలాడుతోంది. """/"/పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కడప జిల్లా మైదుకూరు టౌన్‌లో సాయి బాబా క్లాత్‌ మార్కెట్‌ ఉంటుంది.ఆ మార్కెట్‌లో ఎన్నో క్లాత్‌ స్టోర్స్‌ ఉంటాయి.

ప్రతి స్టోర్‌ కూడా రద్దీగానే ఉంటుంది.మైదుకూరుతో పాటు పక్కన ఉండే పలు ప్రాంతాల నుండి అక్కడకు వచ్చి క్లాత్స్‌ కొనుగోలు చేస్తూ ఉంటారు.

అత్యంత రద్దీగా ఉండే ఆ ఏరియాలో ఒక ఆవు ప్రతి రోజు ఒక షాపులోకి వెళ్తుంది.

ఆ షాపులోకి వెళ్లడమే కాకుండా ఫ్యాన్‌ గాలికి గంట నుండి రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుంటుంది.

ఆ సమయంలో ఆవు చాలా సైలెంట్‌గా నిద్ర పోతుంది. """/"/సాయి బాబా క్లాత్‌ మార్కెట్‌లో ఉండే ఒక షాపు సాయిరాం క్లాత్‌ షోరూం.

ఈ షాపులోకే ఆ ఆవు వస్తుంది.మొదట ఆ ఆవు వచ్చినప్పుడు యజమాని ఏమనకుండా లోనికి రానిచ్చాడు.

ఆవులు ఇళ్లలోకి వస్తే అదృష్టం అంటారు.ఆ విషయాన్ని బాగా నమ్మే ఆ షాపు యజమాని ఒకసారి ఆ ఆవును షాపులోకి నానిచ్చాడు.

అప్పటి నుండి కూడా ఆ ఆవు ప్రతి రోజు ఆ షాపులోకి ఉదయం ఏదో ఒక సమయంలో వచ్చి గంట సమయం లేదంటే రెండు గంటలు దాని ఇష్టానుసారంగా గడిపి పడుకుని పోతుంది.

"""/"/ఆ ఆవు తమ షాపుకు రావడం వల్ల చాలా మంచి జరుగుతుందని, మునుపటితో పోల్చితే ఇప్పుడు తమ బిజినెస్‌ బాగా పెరిగిందని, అలాగే తమ షాపు పాపులారిటీ కూడా బాగా పెరిగిందంటూ షాపు యజమాని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి రోజు ఆవు షాపులోకి రాగానే దానికి పసుపు పెట్టి పూజిస్తారు.ఆ తర్వాత పనిలోకి దిగుతారు.

పక్కనే ఆవు పడుకుని ఉన్నా కస్టమర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా షాపింగ్‌ చేసుకుంటూ ఉంటారు.

"""/"/గత ఆరు ఏడు నెలలుగా ఈ ఆవు షాపుకు వస్తుందట.ఎప్పుడు కూడా షాపులో ఎలాంటి నష్టం చేయలేదు, అలాగే లోనికి వచ్చినప్పుడు మూత్రం పోయడం కాని, పేడ వేయడం కాని చేయలేదట.

అందుకే ఆ ఆవును రెగ్యులర్‌గా రానిస్తున్నట్లుగా యజమాని చెప్పుకొచ్చాడు.ఆ ఆవు ఆ షాప్ కే ఎందుకు వస్తుందో అంటూ స్థానికులు అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

మొత్తానికి గోమాత కారణంగా ఆ షాపు యజమాని నక్క తోక తొక్కాడు కదా.

! .

వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!