దూరవిద్య ద్వారా ఉన్నత విద్యా లక్ష్యాలను చేరుకోవడం సులభం

సూర్యాపేట జిల్లా:వివిధ కారణాలతో చదువుకు దూరమై విద్యాపరంగా వెనుకబడిన వారు దూరవిద్య ద్వారా ఉన్నత విద్యా లక్ష్యాలను చేరుకోవడం సులభమని డాక్టర్‌ బి ఆర్ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ ( Dr.

B.R.

Ambedkar Open University )జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ధర్మానాయక్‌ అన్నారు.శుక్రవారం హుజూర్ నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో డా.

సునీతతో కలిసి హాజరయ్యారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కారణాలతో చదువుకు దూరమైన గృహిణులు, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగులు,వ్యాపారులు దూరవిద్య ద్వారా వారి ఉన్నత విద్యా లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు.

తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను పొందేందుకు డాక్టర్‌ బి ఆర్ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అవకాశం ఉన్నదని చెప్పారు.

విద్యను అభ్యసించే ఎస్సీ,ఎస్టీ,బీసీ, దివ్యాంగ స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్ లు తెలంగాణా ప్రభుత్వం నుంచి త్వరలోనే ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెప్పారు.

అడ్మిషన్లు పెంచేందుకు మీడియా,సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ కు సూచించారు.

నాణ్యమైన విద్యాబోధనకు స్టడీ సెంటర్‌ కౌన్సిలర్స్‌ కృషి చేయాలన్నారు.ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలలో హుజూర్ నగర్ స్టడీ సెంటర్ ఎప్పుడు ముందంజలో ఉందని కితాబు ఇచ్చారు.

ఆ సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు.స్టడీ సెంటర్‌ నిర్వహణకు కావలిసిన అన్నీ సదుపాయాలు కల్పిస్తామని వివరించారు.

స్టడీ సెంటర్‌ నిర్వహణపై సమీక్షించారు.యూనివర్సటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ సుధారాణితో ఫోన్ ఇన్ ద్వారా స్టడీ సెంటర్‌ కౌన్సిలర్స్‌ తో మాట్లాడారు.

సమావేశంలో ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్,కో ఆర్డినేటర్ ఎస్.

బాలరాజు,జాక్టో సైదా నాయక్,కౌన్సిలర్స్ రామారావు,ప్రియాంక,డా.నగేష్,నాగార్జున,శ్రీనివాస రావు,లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: అప్పటివరకు డాన్స్ చేసిన కానిస్టేబుల్.. ఒక్కసారిగా..?