ఏడేళ్లకే ప్రపంచ రికార్డు సాధించి, గిన్నిస్ బుక్‌లో చోటు..!

వయసు చిన్నదే అయినా సంకల్పం పెద్దది అయితే ఎలాంటి రికార్డునైనా బద్దలు కొట్టొచ్చు.

ఆ విషయాన్ని తాజాగా నిరూపించిందో చిన్నారి.ఈ బాలిక వయస్సు కేవలం ఏడేళ్ళే కానీ ఆమె ఎవరికీ సాధ్యం కానీ గిన్నిస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన దేశ్నా ఆదిత్య నాహర్‌ తాజాగా లింబో స్కేటింగ్‌లో ఒక అద్భుతం సాధించింది.

ఈ చిన్నారి ఏకంగా 20 కార్ల కింద నుంచి అత్యంత వేగంగా లింబో స్కేటింగ్‌ పూర్తిచేసి ఆశ్చర్యపరిచింది.

ఆమె లాగా ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ ఫీట్‌ సాధించలేదు.దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డుల్లో చోటు సంపాదించింది.

ఈ బాలిక 193 అడుగుల దూరం వరకు స్కేటింగ్‌ చేయడానికి 13.74 సెకన్ల టైమ్ తీసుకుంది.

గతంలో 14 ఏళ్ల చైనీస్ బాలిక ఇదే దూరాన్ని 14.15 సెకన్లలో పూర్తి చేసింది.

ఆ రికార్డును ఇప్పుడు మన భారతీయ అమ్మాయి బద్దలు కొట్టింది.లింబో స్కేటింగ్‌ను రోలర్‌ లింబో అని కూడా అంటారు.

భూమిపై కాస్త ఎత్తులో అడ్డంగా ఉంచిన పోల్‌ వంటి వస్తువు కింద స్కేటింగ్‌ చేయడాన్నే రోలర్‌ లేదా లింబో స్కేటింగ్‌ అని పిలుస్తారు.

ఈ ఆట భారతీయులకు ఎక్కువగా తెలియక పోయినా ఇది విదేశాల్లో చాలా పాపులర్ గేమ్.

తాజాగా దేశ్నా ఆదిత్య నాహర్‌ 20 కార్ల కింద నుంచి స్కేటింగ్ చేసిన వీడియో ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యింది.

కాగా ఇప్పుడు అది వైరల్ గా మారింది.'ఏప్రిల్‌ 16న మహారాష్ట్ర, పుణెకు చెందిన దేశ్నా ఆదిత్య జస్ట్ 13.

74 సెకన్ల సమయంలో ఏకంగా 20 కార్ల కింద నుంచి స్కేటింగ్ పూర్తి చేసింది.

ఇందుకు ఈ చిన్నారి ఏడాదిన్నరపాటు కఠోరమైన ప్రాక్టీస్ చేసింది.' అని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ఈ బాలికకి తన బుక్‌లో చోటు కల్పిస్తూ పేర్కొంది.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

సీనియర్ రిపోర్టర్ని చెప్పుతో కొట్టిన సీనియర్ నటి!