టీడీపీ కౌన్సిలర్లపై జరిగిన దాడిని ఖండించిన అచ్చెన్నాయుడు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపై జరిగిన దాడులను సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఖండించారు.

టీడీపీ కౌన్సిలర్ విజయకుమార్ పై వైసీపీ శ్రేణులు చేయడం హేయమని వ్యాఖ్యనించారు.రెండు రోజుల క్రితం కూడా టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునపై దాడి జరిగిందన్న ఆయన.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.దళితులపై సీఎం జగన్ కక్ష కట్టారని ఆరోపించారు.

తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆగడాలకు అంతులేకుండా పోతుందని విమర్శించారు.అనంతరం టీడీపీ కౌన్సిలర్లపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.