జూన్ 15న ఆచార్య ఏం చేస్తాడంటే..?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత చిరు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
లాక్‌డౌన్ తరువత సినిమా షూటింగ్ మొదలుపెడదామని చిత్ర యూనిట్ భావించారు.కానీ లాక్‌డౌన్ ఏకంగా రెండు నెలలకు పైగా ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కాగా తెలంగాణ సర్కార్ షూటింగ్‌లకు అనుమతిని ఇవ్వడంతో జూన్ 15న ఆచార్య సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో లాక్‌డౌన్ తరువాత షూటింగ్ మొదలుపెట్టే తొలి చిత్రం ఆచార్య కానున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సినీ ప్రముఖులతో ఆచార్య యూనిట్ సంప్రదింపులు కూడా జరిపినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇక పూర్తి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో నటిస్తున్నాడు.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది.కాగా ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఆ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య.. ఏం జరిగిందంటే?