ఆచార్య మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మారిందా.. అప్పుడే స్ట్రీమింగ్ అంటూ?

మెగాస్టార్ చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాకు తొలిరోజు మార్నింగ్ షోకు డిజాస్టర్ టాక్ వచ్చింది.

రెండు రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయి.ఫస్ట్ వీకెండ్ తర్వాత ఆచార్య బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో ఆచార్య మార్నింగ్ షోలు, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అయ్యాయని సమాచారం అందుతోంది.

చిరంజీవి సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం ఫ్యాన్స్ ను కూడా బాధిస్తోంది.ఈ సినిమా ఫుల్ రన్ లో 55 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం కూడా కష్టమేనని తెలుస్తోంది.

అయితే సినిమా అంచనాలను అందుకోకపోవడంతో అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం అందుతోంది.

భారీ మొత్తం ఖర్చు చేసి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ ఈ నెల 20వ తేదీనుంచి ఓటీటీలో ఆచార్యను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

"""/"/ అమెజాన్ ప్రైమ్ లో త్వరగా అందుబాటులోకి తీసుకొస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చూసే అవకాశం అయితే ఉంటుంది.

థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోని ఆచార్య ఓటీటీలో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందేమో చూడాలి.

ఆచార్య మేకర్స్ అమెజాన్ ప్రైమ్ నిర్వాహకుల మధ్య ప్రస్తుతం ఓటీటీ డీల్ మార్పుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని బోగట్టా.

అయితే ఆచార్య స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఆచార్య ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం ఖర్చు చేసింది.

అయితే అదే స్థాయిలో రికవరీ కూడా ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.ఆచార్య సినిమా రిజల్ట్ గురించి మెగా హీరోలు ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

ఆచార్య రిజల్ట్ ఎఫెక్ట్ పూజా హెగ్డేపై కూడా పడింది.

డెలివరీ తర్వాత జుట్టు అధికంగా రాలిపోతుందా.. అయితే ఇదే బెస్ట్ సొల్యూషన్!