17వ పోలీస్ బెటాలియన్ లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని  నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ 1952 ఎన్నికల్లో తొలిసారి ఆసిఫాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా లక్ష్మణ, తర్వాత 1967,1972లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు.

1957-60 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు అని తెలిపారు.1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి అని స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ అని నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ.జయప్రకాశ్ నారాయణ , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.

శ్తెలజ,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సాగర తీరంలో విరాట్ కోహ్లీ సైకత శిల్పం.. హ్యాపీ బర్త్డే కోహ్లీ