ఆచార్యలో కాజల్.. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ సీన్స్.. మెగా మాఫియా అంటూ ట్విట్టర్ లో ట్రోల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇందులో ఎంతో మంది హీరోలు పరిచయమై స్టార్ హోదాను సొంతం చేసుకున్నారు.

అంతేకాకుండా ఈ ఫ్యామిలీ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉంది.పైగా ఈ మెగా ఫ్యామిలీ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.

అన్ని రకాలుగా హోదాలో ఉన్న మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఇంకా ఏలూతూనే ఉన్నారు.

నిజానికి ఈ ఫ్యామిలీ నుంచి చాలామంది వారసులు ఎంట్రీ ఇవ్వగా.భవిష్యత్తులో కూడా ఈ ఫ్యామిలీ నుంచి ఇంకా అడుగు పెట్టే హీరోలు ఉన్నారని తెలుస్తుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ ఫ్యామిలీ కి ఎంత ఫాలోయింగ్ ఉందో.అంతే వ్యతిరేకం కూడా ఉంది.

గతంలో కొందరి హీరోల విషయంలో ఈ మెగా ఫ్యామిలీ అడ్డుగా ఉందని.వీరి వల్లనే ఆ హీరోలు దిగజారిపోయారు అని ఇప్పటికీ ఆ ఫ్యామిలీ వ్యతిరేకులు అంటూ ఉంటారు.

అలా ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ ని విమర్శించే వారు ఉన్నారని చెప్పవచ్చు.

ఏ సినిమాలో నైనా ముందుగా వీరికే ఇంపార్టెంట్ ఉంటుందని. """/" /ఇండస్ట్రీలో వీరి తర్వాతే ఎవరైనా అనే ఒక బలమైన కారణం ఉందని వార్తలు వినిపించాయి.

అయినా కూడా చిన్నతరహా హీరోలు సొంతంగా కష్టపడి పైకి వస్తున్నారనే చెప్పవచ్చు.ఇక ఈ ఫ్యామిలీ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా మాఫియా జరుగుపుతుందని గతంలో చాలా వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా ఇటీవలే విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కూడా ఈ మెగా ఫ్యామిలీ ని చాలా మంది విమర్శించారు.

కారణమేంటంటే.ఈ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించిన సంగతి తెలిసిందే.

కానీ ఇందులో ఎక్కువ సన్నివేశాలు రామ్ చరణ్ వే కనిపించాయని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఆయన ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

"""/" / పైగా ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ నుంచి తనవరకు ఈ ఇండస్ట్రీలో బాగా పేరు సంపాదించుకున్నారు.

అలాంటిది ఇటీవల క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ కు.ఆ సినిమాలో అంత ఇంపార్టెంట్ ఇవ్వడం వెనుక మెగా మాఫియా ఉంది అంటూ ట్విట్టర్లో తెగ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఆ సినిమాలో ఎన్టీఆర్ కు సంబంధించిన సన్నివేశాలను కూడా తక్కువ చూపించడం వెనుక కారణం వీళ్లే అని అంటున్నారు.

పైగా ఆచార్య సినిమాల్లో కూడా కాజల్ ను తొలగించడానికి కారణం వెనుక కూడా మెగా మాఫియా ఉంది అని నెటిజెన్లు అంటున్నారు.

ఇప్పటికే ఈ విషయం అందరి దృష్టిలో పడగా.ఈ విషయం గురించి మెగా హీరోలు ఎలా స్పందిస్తారో, ఏమని స్పందిస్తారో ఎదురు చూడక తప్పదు.