ఆచార్య ఇంటర్వ్యూ.. కాజల్ పేరు కూడా ఎత్తలేదు..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే.ముందు కేవలం పావు గంట రోల్ మాత్రమే అనుకున్న చరణ్ రోల్ సినిమా మొత్తం వచ్చేలా చేశారు కొరటాల శివ.

చిరు, చరణ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇస్తాయని తెలుస్తుంది.

సినిమాలో చరణ్ కి జోడీగా పూజా హెగ్దే నటించగా చిరంజీవికి జతగా కాజల్ అగర్వాల్ నటించింది.

రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ, చరణ్ కలిసి భార్గవి తో స్పెషల్ చిట్ చాట్ చేశారు.

దాదాపు 40 నిమిషాల దాకా జరిగిన ఈ ఇంటర్వ్యూలో డైరక్టర్ కొరటాల శివ, చరణ్ ఇద్దరు సినిమాలో ఒక హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ గురించి ప్రస్థావించలేదు.

ఈమధ్య రిలీజైన ట్రైలర్ లో కూడా కాజల్ ని చూపించలేదు.ఇంటర్వ్యూలో కూడా కాజల్ అగర్వాల్ పేరుని మాట వరసకి కూడా చెప్పలేదు.

మరి కాజల్ ఎపిసోడ్ సినిమా నుండి నిజంగానే తీసేశారా అన్న డౌట్ స్ట్రాంగ్ అవుతుంది.

ఈ పాత్రను వీరు కాకుండా మరెవరు చేసిన అద్భుతంగా ఉండేవి !