జనతా గ్యారేజ్‌ను పట్టుకొస్తున్న ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రం తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సనిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది.కాగా ఈ సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.

అయితే గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్‌లో కొరటాల శివ నేచర్‌ను కాపాడే ప్రస్తావన తీసుకువచ్చాడు.

ఇప్పుడు ఆచార్యలో కూడా ప్రకృత వనరుల గురించిన ప్రస్తావన తీసుకొస్తున్నాడు కొరటాల.ఈ సినిమాలో మెగాస్టార్ ఈ అంశంపైనే పోరాటం చేయనున్నాడు.

ఈ సినిమాలో జనతా గ్యారేజ్ అంశాలను కొరటాల చాలా వరకు చూపిస్తాడట.మొత్తానికి జనతా గ్యారేజ్ షేడ్స్‌ను ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నాడని, అందులో ఒకటి నక్సలైట్ పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

స్టార్ట్ అయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. దీంతో అయిన సక్సెస్ కొడుతడా..?