ఉప్పెనను చూసి వాత పెట్టుకుంటున్న ఆచార్య, ఎఫ్3.. అసలేమైందంటే?

సాధారణంగా ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపరు.

ఫిబ్రవరి నెలలో సినిమాలను రిలీజ్ చేయడం వల్ల ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కొన్నేళ్ల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా సైతం ఫిబ్రవరి నెలలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా భారీగా కలెక్షన్లు రాబట్టలేదు.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఉప్పెన సినిమాకు మాత్రం భారీగా కలెక్షన్లు వచ్చాయి.

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కావడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఉప్పెన సినిమా హిట్ టాక్ ను అందుకుని నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.

ఉప్పెన సినిమా ఫలితాన్ని చూసి మేకర్స్ ఆచార్య, ఎఫ్3 సినిమాలను సైతం ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఫిబ్రవరి 4వ తేదీన ఆచార్య రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 25వ తేదీన ఎఫ్3 సినిమా విడుదల కానుంది.

"""/"/ చిన్నసినిమాగా విడుదలై 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఉప్పెనను చూసి పెద్ద సినిమాలను కూడా ఫిబ్రవరిలో విడుదల చేస్తే ఈ సినిమాలు సక్సెస్ సాధించే ఛాన్స్ కంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

వచ్చే ఏడాది జనవరిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రిలీజయ్యే సినిమాలకు అనుకూలమైన పరిస్థితులు లేవు.

"""/"/ ఫిబ్రవరి సమయంలో విద్యార్థులు పరీక్షల హడావిడిలో ఉంటారు కాబట్టి ఆ సమయంలో సినిమాలను రిలీజ్ చేస్తే సినిమా కలెక్షన్లపై కూడా ఆ ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

ఉప్పెనను చూసి ఎఫ్ 3, ఆచార్య మేకర్స్ వాత పెట్టుకుంటున్నారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలు విడుదలైన తర్వాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాయో చూడాలి.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కొత్త సెట్ వేస్తున్నారా..?