సంక్రాంతికి ఆచార్య షాక్.. పోస్టర్ వస్తుందనుకుంటే పోస్ట్ పోన్ న్యూస్ వచ్చింది..!

పండుగకి మెగా ఫ్యాన్స్ కు గట్టి షాక్ తగిలింది.ఇప్పటికే ఆర్.

ఆర్.ఆర్ సినిమా వాయిదా పడ్డదని బాధపడుతుండగా ఫిబ్రవరి 4న రిలీజ్ అనుకున్న ఆచార్య సినిమాని వాయిదా వేస్తూ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు ఆచార్య టీం.

ప్రస్తుతం కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న కారణంగా పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటించారు.

సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.మణిశర్మ మ్యూజిక్ అందించిన సినిమాలోని రిలీజైన సాంగ్స్ అన్ని ప్రేక్షకులను అలరించాయి.

సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి సినిమా నుండి పోస్టర్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ కి షాక్ తగిలింది.

పోస్టర్ కాదు కాని సినిమా పోస్ట్ పోన్ అంటూ వచ్చిన ఎనౌన్స్ మెంట్ కి మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది.

మరి ఆర్.ఆర్.

ఆర్, రాధే శ్యాం ల బాటలో ఆచార్య కూడా వాయిదా బాట పడింది.

మరి ఈ సినిమాల కొత్త రిలీజ్ డేట్ లు ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.

భర్తతో కలిసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క.. ఆ నాయకుడికి పోటీగా?