జడ్జి కళ్ల ముందే ముద్దాయి హత్య.. ఎక్కడో తెలుసా?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే.

తాజాగా జరిగిన ఓ హత్య అక్కడ నెలకొన్న రాక్షస రాజ్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఓ కేసులో ముద్దాయి అయిన వ్యక్తిని కోర్టులో విచారిస్తుండగా జడ్జి కళ్ల ముందే హత్య చేసిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది.

బిజ్నూర్ జిల్లా కోర్టులో జరిగిన ఈ ఉదంతంలో హత్య కేసులో నిందితుడైన షానవాజ్ అన్సారీని జడ్జి విచారిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అతడిని అతి కిరాతకంగా కాల్చి చంపారు.

ఈ దాడిలో కోర్టు ఉద్యోగి ఒకరు గాయపడ్డారు.జడ్జి, కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు చెక్క బల్లల కింద దాక్కుని తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

కాగా కాల్పులు జరిపిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.న్యాయస్థానంలో కూడా హత్యలు జరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్ధం చేసుకోవచ్చు.

ఏదేమైనా ఈ ఘటనతో అక్కడి శాంతిభద్రతలపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

జుట్టు స్మూత్ గా, సిల్కీ గా మారాలా.. అయితే ఇలా చేయండి..!