వైరల్ వీడియో: లాకప్‌లో ఉన్న స్నేహితుడితో రీల్స్..

ఈమధ్య సోషల్ మీడియాలో యువత ఫేమస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడం తలచి చూస్తూనే ఉన్నాము.

ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలలో యువత చేసే అనేక విషయాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అయితే ఇలా కొంతమంది చేసిన వీడియోల వల్ల అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి తన ఫ్రెండ్ జైల్లో( Jail ) ఉండగా అతనిని కలవడానికి వెళ్ళాడు.

అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ లోనే రీల్స్ ( Reels ) చేయడం మొదలుపెట్టేశాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / ఇకపోతే ఓ వ్యక్తి ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లాడని హైదరాబాదులోని( Hyderabad ) ఓ తల్లి తన కూతుర్ని తీసుకెళ్లిపోయాడని బండ్లగూడ( Bandlaguda ) ప్రాంతానికి చెందిన పోలీసులను ఆశ్రయించింది.

అయితే ఆ తల్లి స్థానిక యువకుడు దస్తగిరి పై( Dastagiri ) అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

అయినాకాని ఆ బాలిక ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోయారు.దాంతో ఆ మహిళ ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేయడంతో దాంతో పోలీసులు ఏమి చేసేదిలేక బండ్లగూడ పోలీస్ లు ఆ వ్యక్తిని తీసుకువచ్చి జైల్లో ఉంచారు.

"""/" / అతడు జైల్లో ఉన్న సమయంలో అతని ఫ్రెండ్స్ సహాయంతో రీల్స్ చేస్తూ బాలిక కుటుంబంపై దస్తగిరి విమర్శలకు దిగాడు.

ఇక ఈ వీడియోని గమనించిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు, పాతబస్తీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్ లో అతడికి పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని పోలీస్ స్టేషన్ లోనే రీల్స్ చేస్తుంటే వారిపై ఎలా చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇప్పుడు రోజా, ధర్మాన వంతు ! రంగంలోకి సీఐడీ