కెనడా : రిపుదమన్ మాలిక్ హత్య కేసు .. నిందితుడికి జీవిత ఖైదు

కెనడా : రిపుదమన్ మాలిక్ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు

1985లో యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిరిండియా కనిష్క విమానాన్ని( Air India Kanishka ) పేల్చివేసిన ఘటనలో నిందితుడు రిపుదమన్ సింగ్ మాలిక్‌ను( Ripudaman Singh Malik ) హత్య చేసిన ఘటనలో నిందితుడికి కెనడా కోర్టు జీవిత ఖైదు విధించింది.

కెనడా : రిపుదమన్ మాలిక్ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు

నిందితుడు టానర్ ఫాక్స్‌ను( Tanner Fox ) ఈ కేసులో దోషిగా తేల్చిన బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి టెరెన్స్ షుల్టెస్ మంగళవారం శిక్షను ఖరారు చేస్తూ తుదితీర్పు వెలువరించారు.

కెనడా : రిపుదమన్ మాలిక్ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు

అయితే రిపుదమన్ మాలిక్ హత్య కోసం నిందితుడిని ఎవరు నియమించుకున్నారో మాత్రం బయటకు రాలేదు.

సహ నిందితుడు జోస్ లోపెజ్‌తో( Jose Lopez ) కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడు.

అతడికి ఇంకా శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.మాలిక్ కోడలు సందీప్ కౌర్ ధాలివాల్ .

ఈ హత్య వెనుక ఉన్నవారు ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఇద్దరు నిందితులు మాలిక్‌పై విచక్షణారహితంగా కాల్చి చంపారని ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిందేనని , ఇందుకోసం వారిద్దరూ పెద్ద ఎత్తున డబ్బును అందుకున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

"""/" / కాగా.1985 జూన్ 23న ఎయిరిండియా విమానం 182లో (కనిష్క) అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయి 329 మంది మరణించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు అనుమానితుడిగా వున్న రిపుదమన్ సింగ్ మాలిక్ 2022 జూలై 14న కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు.

వాంకోవర్ సమీపంలో గుర్తు తెలియని ముష్కరులు మాలిక్‌పై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

"""/" / ఇప్పటికీ రిపుదమన్ మాలిక్ హత్య వెనుక గల కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి.

కెనడాలో గురుగ్రంథ్ సాహిబ్ కాపీలను ముద్రించడంపై ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌తో మాలిక్‌కు వైరం ఉందని ఆరోపణలు వచ్చాయి.

ఆయన హత్య తర్వాత ఏడాదికే సర్రేలో నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.ఈ రెండు హత్యల వెనుక ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

వైరల్: ఈ కుర్రాడి స్పీడ్‌ చూసి కంపెనీలే భయపడుతున్నాయి… మేన్ మెషీన్ అనాలేమో?