గరిడేపల్లి పోలీస్ స్టేషన్ గోడదూకి నిందితుడు పరార్…!
TeluguStop.com

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల( Garidepalli Mandal ) కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఓ దొంగ గోడ దూకి పరారైన సంఘటన శనివారం వెలుగు చూసింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఇటీవల మండలంలోని గరిడేపల్లి,గడ్డిపల్లి,రంగాపురం,వెలిదండ వివిధ గ్రామాల పొలాల్లో దాదాపు 50 మోటార్లు దొంగలు ఎత్తుకుపోయారు.


దీంతో కొంతమంది రైతులు కాపుగాసి ఓ యువకుడిని పట్టుకొని గురువారం పోలీసులకు అప్పగించారు.
పోలీసులు విచారణ చేసి మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మరో ఇద్దరి నిందితులను పట్టుకొచ్చారు.
దానిలో ఒకరు విచారణ చేయకముందే మూత్రానికని చెప్పి గోడ దూకి పరారైనట్లు తెలిపారు.
పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మా ఇంటికి చిట్టితల్లి వచ్చింది… ఎమోషనల్ పోస్ట్ చేసిన శ్రీ లీల!