నంద్యాల కానిస్టేబుల్ హత్య కేసులో నిందితులు అరెస్ట్
TeluguStop.com
నంద్యాల కానిస్టేబుల్ సురేంద్రనాథ్ హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కర్నూలు ఔటర్ రింగ్ రోడ్డులోని టిడ్కో ఇళ్ల వద్ద ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారని కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు.
అనంతరం వారి నుంచి మూడు పిడిబాకులు, ఐదు బైకులతో పాటు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో నలుగురు రౌడీ షీటర్లు ఉన్నట్లు గుర్తించారు.తమ నేర చరిత్రను ఉన్నతాధికారులకు చేర వేస్తున్నారనే కారణంతోనే కానిస్టేబుల్ సురేంద్రనాథ్ ను హత్య చేశారని డీఐజీ సెంథిల్ కుమార్ వెల్లడించారు.
అనంతరం మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
వైశాలికి షేక్‌హ్యాండ్ ఇవ్వని ఉజ్బెక్ చెస్ ప్లేయర్.. ఇస్లాం కారణమంటూ కొత్త ట్విస్ట్..?