పల్సర్ బైక్ సాంగ్ రమణపై ఆరోపణలు..!
TeluguStop.com
పల్సర్ బైక్ సాంగ్ రమణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పొట్టిదాయి కాడమ్మ గట్టిదాయమ్మ అనే పాటను తన దగ్గర నుంచి రమణ కాజేసి పాపులర్ అయ్యాడని సురేశ్ అనే యువకుడు ఆరోపిస్తున్నాడు.
కాగా సురేశ్ విజయనగరం జిల్లా కేంద్రంలోని బొబ్బడపు గ్రామానికి చెందిన యువకుడు.తన పాటలను కమర్షియల్ కోణంలో మార్చుకున్నాడని రమణపై తీవ్ర ఆరోపణలు చేశారు.
కాగా పల్సర్ బైక్ సాంగ్ సోషల్ మీడియాలోనే కాకుండా ఇటీవల వచ్చిన రవితేజ సినిమాలో కూడా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
బుల్లిరాజు రోల్ విమర్శలపై అనిల్ రావిపూడి సమాధానం ఇదే.. ఏం చెప్పారంటే?