సానుభూతి కోసమే ఆరోపణలు.. మాజీ మంత్రి పేర్ని నాని

వైసీపీని వీడే ముందు సానుభూతి కోసమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు.

నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల కిందటే చెప్పొచ్చు కదా.ఇన్ని రోజులు ఎందుకు ఆగారో చెప్పాలన్నారు.

ఫోన్ వాడే వాళ్లలో చాలా మంది వాయిస్ రికార్డ్ చేస్తారన్న ఆయన ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయడమే పనా అని ప్రశ్నించారు.

పార్టీ నుంచి వెళ్లిపోవడానికి చాలా మాట్లాడతారని విమర్శించారు.ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వారికే మంత్రి పదవులు లేవని తెలిపారు.

సామాజిక సమీకరణలో మంత్రి పదవి రాకపోవచ్చని పేర్కొన్నారు.జగన్ పార్టీ పెట్టకపోయి ఉంటే ఇంతమంది ఎమ్మెల్యేలు అయి ఉండేవారా అని నిలదీశారు.

ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్న పేర్ని నాని దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఎంత డబ్బు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా చేయను…స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!