నమ్మకంగా ఉంటూ ఎన్నారైని వెన్నుపోటు పొడిచిన అకౌంటెంట్.. మోసం ఎలా బయటపడిందంటే..

అమర్‌జిత్ సింగ్ బాలి( Amarjit Singh Bali ) అనే యూఎస్ ఎన్నారై లూథియానాలో( Ludhiana ) BS స్టీల్ అనే కంపెనీని రన్ చేస్తున్నాడు.

ఈ కంపెనీ యంత్రాలు, స్క్రాప్‌లను దిగుమతి చేస్తుంది.అమర్‌జిత్‌కు అమర్‌జిత్ సింగ్ భట్టి అనే అకౌంటెంట్ ఉన్నాడు.

సదరు అకౌంటెంట్ అతనికి చాలా కాలంగా తెలుసు.అయితే ఫేక్ బిల్స్( Fake Bills ) సృష్టించి అతనే నమ్మకద్రోహం చేశాడు.

వాస్తవానికి అమర్‌జిత్ సింగ్ బాలి ఎక్కువగా అమెరికాలో( America ) ఉంటాడు.ఆ కారణంతో తన కంపెనీని చూసుకునే, రోజువారీ పనిని నిర్వహించే బాధ్యతను భట్టికి ఇచ్చాడు.

కంపెనీ పన్నులకు చెల్లించాల్సిన చెల్లింపుల గురించి భట్టి అమర్‌జిత్ సింగ్ బాలికి తెలియజేసేవాడు.

"""/" / అయితే 2019 నుంచి అమెరికాలో ఉన్న అమర్‌జిత్ సింగ్ బాలి 2022లో భారత్‌కు తిరిగి వచ్చాడు.

ఆ సమయంలో తాను వివిధ కంపెనీల నుంచి కొనుగోళ్లు జరిపానని, వాటికి పన్నులతో సహా పేమెంట్స్ చేయాల్సి ఉందని అకౌంటెంట్ భట్టి చెప్పాడు.

ఈ కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులను భట్టి ఎన్నారై సింగ్‌కి చూపించాడు.ఇందులో M/S లూథ్రా అండ్ కో అనే కంపెనీ నుంచి రూ.

1 కోటి విలువైన వస్తువులను కొనట్లు బిల్లు కూడా ఉంది.ఈ కొనుగోలు కోసం GST (పన్ను) దాదాపు రూ.

18 లక్షలు. """/" / అమర్‌జిత్ సింగ్ బాలి భట్టిని నమ్మి కొన్ని చెక్కులపై సంతకం చేసాడు, తద్వారా భట్టి ఈ చెల్లింపులను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేశాడు.

అయితే తమ ఏజెంట్లు మునీష్ కుమార్, గోల్డీ, మరికొందరు ఎంఎస్ బీఎస్ స్టీల్ పేరుతో నకిలీ బిల్లులు తయారు చేశారని ఎంఎస్ లూత్రా అండ్ కో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలింది.

అమర్‌జిత్ సింగ్ బాలి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.శరభ నగర్ పోలీసులు తమదైన శైలిలో కోటింగ్ ఇవ్వడంతో డబ్బు అందుకున్న కొందరు వ్యక్తులు రూ.

80 లక్షలు తిరిగి ఇచ్చారు, కానీ ఇప్పటికీ రూ.39.

35 లక్షలు రికవరీ కాలేదు.ఇప్పుడు అమర్జిత్ సింగ్ బాలి అకౌంటెంట్ అయిన అమర్జిత్ సింగ్ భట్టి, మరో ఏడుగురిని పోలీసులు విచారిస్తున్నారు.

‘హరిహర వీరమల్లు’ సినిమా మీద హైప్ పెంచుతున్నారా..?