ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా..? అయితే ఇది దానికి సంకేతమా..?

శకున శాస్త్రం, సాముద్రిక శాస్త్రాలు అనేవి మన నిత్యజీవితంలో ఒక భాగంగా అయిపోయాయి.

అయితే ఇంట్లో ఉన్న పశువులు, పక్షులు కూడా శకునాల కిందకి వస్తాయి.ఇంట్లో జంతువులను పెంచుకుంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాలను శకున సాముద్రిక శాస్త్రాలు తెలియజేశాయి.

అంతేకాకుండా ఇంట్లో చీమలు ( Ants ) కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?.అంతేకాకుండా ఎటువంటి చీమలు ఇంట్లో కనిపిస్తే మంచిది? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

చీమలు అనేవి మంచి, చెడు రెండింటిని కూడా సూచిస్తాయి.చీమలు ఇచ్చే కొన్ని సంకేతాల వలన ఇంట్లో( Home ) మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్నది తెలుసుకోవచ్చని శకున శాస్త్రం చెబుతోంది.

"""/" / ముఖ్యంగా చీమలు రెండు రకాలుగా ఉంటాయి.ఎర్ర చీమలు, నల్ల చీమలు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మంచిదని, ఎర్ర చీమలు( Red Ants ) కనిపిస్తే శుభం కాదని శకున శాస్త్రం వివరిస్తుంది.

సంస్థల్లో కానీ, కార్యాలయాల్లో కానీ, ఇంట్లో కానీ చీమలు బయటకు వస్తున్నాయంటే మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయని దానికి సంకేతాలు ఇస్తున్నట్లు శాస్త్రం వివరిస్తుంది.

ఇంట్లో నల్ల చీమలు కనిపించడం వలన కొత్త వ్యాపారాలు( New Business ) ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

అంతేకాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉందని శాస్త్రం చెబుతోంది.

"""/" / అయితే నల్ల చీమలు అధికంగా వస్తే మాత్రం అది మంచిది కాదని తెలిపింది.

అదేవిధంగా ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని శకున శాస్త్రం( Shakuna Shastra ) హెచ్చరిస్తోంది.

అందుకే ఇంట్లో ఎక్కువగా ఎర్ర చీమలు కనిపించకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఇంట్లో పడకగదిలో నల్ల చీమలు కనిపిస్తే కొన్ని బంగారు వస్తువులను కొనుగోలు చేయవచ్చని శకున శాస్త్రం చెబుతోంది.

ఇంటి టెర్రస్ పై నల్ల చీమలు కనిపిస్తే ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

మల్లెపూలు అలంకరణకే కాదు ఇలా కూడా ఉపయోగపడతాయని తెలుసా?