సంఖ్యాశాస్త్రం ప్రకారం 9తో ఒకటి కలిస్తే ఏమవుతుంది.. రెండు కలిస్తే ఏమవుతుందో తెలుసా..?
TeluguStop.com
న్యూమరాలజీ( Numerology ) ప్రకారం పుట్టిన తేది ఆధారంగా సంఖ్యలు వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవచ్చని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
ఆయా నెంబర్లతో ఇతర నెంబర్లను కలిపినప్పుడు కలిగే ప్రయోజనాలు నష్టాలను కూడా తెలుసుకోవచ్చు.
మరి తొమ్మిది సంఖ్యతో ఒకటి కలిస్తే ఏమవుతుంది.రెండు కలిస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నంబర్ 9 నంబర్ 1( Number 9 Is Number 1 ) అనేవి దేనికవే శక్తివంతమైనవి అని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
ఈ రెండు సంఖ్యల వారు కలిస్తే అదిరిపోతుంది.పుట్టిన తేది ఆధారంగా నంబర్ 9 వచ్చేవారు బాగా ప్రేమిస్తారు.
నంబర్ 9 అనేది మానవత్వం, కమ్యూనికేషన్ కి మంచి సంఖ్య.19వ తేదీన పుట్టిన వారు 1,9 సంఖ్యల పర్సనాలిటీ గుణాలు కలిగి ఉంటారు.
వీరు గొప్ప ప్రసారకులు, నాయకులు, దేశభక్తులు, వ్యాపారవేత్తలు, మధ్యవర్తులు గా రాణిస్తారు.కొన్నిసార్లు నెంబర్ 1, 9 వారు తమ సామర్ధ్యాన్ని తప్పుగా ఉపయోగిస్తారు.
వారు తమ వ్యక్తిగత జీవితంలో కోపం, ఆవేశాలను అదుపు చేసుకోవడం ఎంతో మంచిది.
"""/" /
ఒకటి, తొమ్మిది మధ్య ప్రేమ సంబంధానికి ఒకే ఒక లోపం ఉంటుంది.
అది వారి కోపం, అహం.ఎరుపు, ఆరెంజ్ వారి బెస్ట్ కలర్స్ అని కచ్చితంగా చెప్పవచ్చు.
వీటినే వీరు ఎక్కువగా ఉపయోగించాలి.సూర్య భగవానుడిని వీరు ఎప్పుడు పూజిస్తూ ఉండాలి.
సూర్యుడు వారి జీవిత గురుత్వాకర్షణను బలపరుస్తాడు.నంబర్ రెండుకి భావోద్వేగాలు ఎక్కువ.
వీరు 9 కి లక్కీ నంబర్ గా నిలబడతారు. """/" /
నెంబర్ 9కి ఉన్న కోపాన్ని నెంబర్ రెండు కంట్రోల్ చేస్తుంది.
2, 9 నంబర్లు గల రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, బిల్డర్స్ పార్ట్నర్స్( Real Estate Brokers, Builders Partners ) అయితే ఎక్కువ లాభపడతారు.
నెంబర్ 9 నెంబర్ 2 వారు తమ ఆఫీస్ టేబుల్ పై నిజమైన మొక్కను పెంచడం ఎంతో మంచిది.
పుట్టిన తేదీలలో 2,9 కలిగిన నటులు, ఫిలిం డైరెక్టర్స్, రచయితలు, మీడియా వ్యక్తులు, వైద్యరంగంలోని మహిళ నిపుణులు అత్యంత విజయవంతమయ్యారు.
వీరి లక్కీ కలర్స్ వైలెట్, పింక్.లక్కీ డే సోమవారం, మంగళవారం.