న్యూమరాలజీ ప్రకారం ఈ రాడిక్స్ సంఖ్యల వారు అదృష్టవంతులు..!
TeluguStop.com
న్యూమరాలజీ( Numerology ) ప్రకారం వ్యక్తి పుట్టిన తేదీ ప్రభావం అతని జీవితం పై ఉంటుంది.
అతని వ్యక్తిత్వం పై కూడా ఆధారపడి ఉంటుంది.అలాగే న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యకు ఎంతో విశిష్టత ఉంది.
రాడిక్స్ సంఖ్య ను పుట్టిన తేదీ మొత్తం నుంచి లెక్కిస్తారు.కొన్ని రాడిక్స్ సంఖ్యల ఆధారంగా ఆయా తేదీలలో జన్మించిన వ్యక్తులను అదృష్టవంతులుగా భావిస్తారు.
అలాంటి వారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవనం సాగిస్తారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఏ రాడిక్స్ సంఖ్యలో పుట్టిన వారు అదృష్టవంతులో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే నెలలో 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారికి రాడిక్స్ సంఖ్య నాలుగు అవుతుంది.
"""/" /
ఈ వ్యక్తులు అద్భుతమైన వ్యూహాలను రచిస్తారు.వీరి ఆలోచన విధానం చాలా పదును గా ఉంటుంది.
రాడిక్స్ నెంబర్(
Radix Number ) 4 ఉన్న వ్యక్తులు చాలా కష్టపడి పని చేస్తారు.
అలాగే వీరు కష్టపడి జీవితంలో విజయం సాధించే వ్యక్తులుగా ఉంటారు.వీరు జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు.
ఏ నెలలోనైనా 5,14, 23వ తేదీలలో జన్మించిన వారికి రాడిక్స్ సంఖ్య 5 ఉంటుంది.
వీరిలో కూడా పదమైన తెలివితేటలు ఉంటాయి.ఒకే సారి చాలా పనులు చేయగల మల్టీ టాలెంట్ వీరిలో ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే రాడిక్స్ సంఖ్య 5 ఉన్న వారు మంచి వ్యాపారవేత్తలు అవుతారు.
"""/" /
వీరు ఏ పనినైనా ఎక్కువ సేపు చేయగలరు.ఇంకా చెప్పాలంటే 6, 15, 24 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 6.
ఈ సంఖ్య శుక్ర గ్రహాని( Sukra Graham )కి సంబంధించినది.అలాగే ఈ సంఖ్య ను సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు.
అందువల్ల రాడిక్స్ సంఖ్య 6 ఉన్న వారి జీవితం ఆర్థికంగా బాగానే ఉంటుంది.
రాడిక్స్ సంఖ్య 7 ఉండాలంటే 7, 16, 25 తేదీలలో పుట్టి ఉండాలి.
అలాగే రాడిక్స్ సంఖ్య 7 ఉన్న వారికి అద్భుతమైన నిర్ణయాధికారం ఉంటుంది.అలాగే రాడిక్స్ సంఖ్య 7 ఉన్న వారికి అదృష్టం సహకరిస్తుంది.
న్యూమరాలజీలో ఏడును లక్కీ నెంబర్ అని అంటారు.
కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి మహిళలు..!