ఏఐతో ప్రమాదాలు తప్పవు.. హెచ్చరిస్తున్న మేధావి వర్గాలు!

ఇంటర్నెట్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) సంచలనంగా మారింది.ఏఐ ప్రొడక్ట్స్ మనుషులకు దీటుగా, మనుషులకు మించిన పనులను కూడా చేస్తూ ఆశ్చర్యపరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఏఐతో భవిష్యత్తులో అనేక ప్రమాదాలు ఎదురవుతాయని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభ దశలోనే ఉంది ఇప్పటికే ఇది చాలా సమర్థత దూసుకుపోతోంది.

ఇలాంటి నేపథ్యంలో ఏఐ వినియోగంపై నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.

లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు ఫేస్ చేయక తప్పదని వివిధ రంగాల మేధావులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

"""/" / రీసెంట్‌గా వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన దాదాపు 350 మంది సెంటర్‌ ఫర్‌ ఏఐ సేఫ్టీ (సీఏఐఎస్‌) వెబ్‌సైట్‌లో సంతకాలతో సహా ఓ సెన్సేషనల్ స్టేట్‌మెంట్ చేశారు.

ఏఐతో అంతరించిపోయే రంగాలను ఉన్నాయని వారు ఈ ప్రకటనలో పేర్కొన్నారు.ఆరంగాలను అంతరించిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా అంటువ్యాధులు, అణు యుద్ధాల వంటి(Nuclear Wars ) పెనుముప్పులను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని గుర్తు చేశారు.

"""/" / ఈ ప్రకటనపై సైన్స్‌ చేసినవారిలో ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మ్యాన్‌( Sam Altman ), గూగుల్‌ డీప్‌మైండ్‌ సీఈవో డెమిస్‌ హస్సాబిస్‌, ఆంత్రోపిక్‌ సీఈవో డేరియో అమోడీ కూడా ఉండటం విశేషం.

ఇకపోతే ఏఐ అనేది మనుషులు సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.మనుషులే అవసరం లేకుండా పనులు జరిగేలా ఏఐ మార్పు తీసుకొస్తుందని ఇంకొందరు వాదిస్తున్నారు.

ఏది ఏమైనా ఏఐ మనుషుల జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకురానిందని స్పష్టం అవుతుంది.

ఆస్తికోసం కాదు.. ఆత్మగౌరవం కోసమే గొడవలు ఓపెన్ అయిన మంచు మనోజ్!