డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చెయ్యండి: కలెక్టర్
TeluguStop.com
ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.
మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
బ్లాకుల వారీగా నిర్మాణాలు, సౌకర్యాలకల్పనపై దృష్టి పెట్టాలన్నారు.నిర్మాణాలు పూర్తయిన చోట విద్యుద్దీకరణ, సానిటరీ, డ్రైన్స్ నిర్మాణం, సీవరేజ్, సెప్టిక్ ట్యాoకుల నిర్మాణాలు, అంతర్గత రహదారులు, అప్రోచ్ రోడ్ లపై దృష్టి పెట్టి వెంటనే పూర్తి చేయాలన్నారు.
20 అక్టోబర్ కల్లా విద్యుత్ సంబంధ పనులు పూర్తి కావాలన్నారు.వివిధ శాఖల సమన్వయంతో పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్వో శిరీష, ఆర్ అండ్ బి, పీఆర్, టీఎస్ ఇఎంఐడిసి, ట్రైబల్ శాఖల ఇఇ లు శ్యామ్ ప్రసాద్, శ్రీనివాసరావు, నాగశేషు, తానాజి, డిఇ లు తదితరులు పాల్గొన్నారు.
Blackjack Variants & All Blacks Betting: A Practical Guide For NZ Punters