సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫిస్ పై ఏసీబీ రైడ్స్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ అక్రమ లేఔట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు, ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సూర్యాపేటకు చెందిన మేక వెంకన్న అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
సొమ్ము ముట్ట చెప్పిన వారికి ఏ పనైనా అవలీలగా పూర్తి చేస్తున్న సబ్ రిజిస్టర్,తన కూతురుకు ఇచ్చిన 800 గజాల స్థలం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు 4 నెలలుగా తిప్పుకుంటూ, పెద్ద మొత్తంలో సొమ్ము డిమాండ్ చేయడంతో సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
దీనితో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం.సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బులు డిమాండ్ చేయాగా భాధితుడు మేక వెంకన్న నుంచి 90 వేల 200 రూపాయలను డాక్యుమెంట్ రైటర్లు కల్లురు శ్రీనివాస్,తంగేళ్ల వెంకటరెడ్డి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈ మేరకు రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు డాక్యుమెంట్ రైటర్లు కల్లూరి శ్రీనివాసు, తంగెళ్ల వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు.
కార్యలయంలోని మొత్తం ఫైళ్లను స్వాధీనం చేసుకుని వాటిపై సమగ్ర విచారణ తర్వాత ఈ కేసులో ఏ1 గా సబ్ రిజిస్టర్ సుందర్ నాయక్,ఏ2గా కొల్లూరు శ్రీనివాస్ రెడ్డి,ఏ3గా తంగెళ్ల వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బంగాళదుంప తింటే బరువు పెరుగుతారా..?