మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భూములపై ఏసీబీ ఫోకస్

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్( Telangana Former CS Somesh Kumar ) భూములపై ఏసీబీ ఫోకస్ పెట్టింది.

ఫార్మాసిటీ అంశం ముందే తెలుసుకొని భూములు కొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారని ఏసీబీ అధికారులు గుర్తించారు.

పదవిలో ఉన్న సమయంలోనే భార్య పేరున భూమిని సోమేశ్ కుమార్ రిజిస్ట్రేషన్ చేయించారని తెలుస్తోంది.

ఆ భూమి పక్కనే సన్నిహిత కుటుంబానికి చెందిన 123 ఎకరాలు ఉండగా.సోమేశ్ కుమార్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా పలు ఆరోపణలు వచ్చాయి.

"""/"/ గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల పేరుతో కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలోనే ఎకరాకు రెండు లక్షలు చెల్లించి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయం( Ibrahimpatnam Sub Registrar Office )లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వారిని విచారించాలని ఏసీబీ భావిస్తుంది.

నెల్సన్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడా..?