ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్‎మెంట్‎కు ఏసీబీ కోర్టు అనుమతి

ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్‎మెంట్‎కు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు టెరాసాఫ్ట్, ఎండీ వేమూరి హరిప్రసాద్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల అటాచ్‎మెంట్‎కు కోర్టు అంగీకారం తెలిపింది.

కేసులో మొత్తం ఏడుగురి ఆస్తుల అటాచ్‎మెంట్‎కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.అయితే రూ.

114 కోట్ల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు అటాట్ మెంట్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.