చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు..!!
TeluguStop.com
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ( Chandrababu )ఏసీబీ రిమాండ్ విధించడం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.ఈ క్రమంలో ఏసీబీ న్యాయస్థానంలో హౌస్ రిమాండ్ పిటిషన్ వేయడం జరిగింది.
చంద్రబాబు తరఫున సిద్ధార్థ లుధ్రా వాదనలు వినిపించగా సీఐడీ తరఫున.పొన్నవోలు సుధాకర్ రెడ్డి( Ponnavolu Sudhakar Reddy ) వాదనలు వినిపించారు.
ఇరువైపులా వాదనలు మూడు విడతలుగా విన్న ఏసీబీ న్యాయస్థానం తీర్పు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది.
చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై మంగళవారం తీర్పు ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
"""/" /
దీంతో రేపు ఏసీబీ న్యాయస్థానం( ACB Court ) వెలువరించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు ఇంట్లో కంటే జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని, హౌస్ రిమాండ్ లో ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, జైల్లో కూడా పూర్తిస్థాయి సెక్యూరిటీని కల్పిస్తామంటూ.
అత్యవసరమైతే వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
మరోపక్క చంద్రబాబుకు జైల్లో ప్రమాదం ఉందని ఆయనకు ఇప్పటి వరకు ఎన్ఎస్టి భద్రత.
ఉందని జైల్లో కల్పించిన భద్రతపై అనుమానాలు ఉన్నాయని సిద్ధార్థ లుధ్రా వాదనలు వినిపించారు.
దీంతో రేపు ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబుకి ఊరాట దక్కుతుందా.? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
SSMB 29 నో వాటర్ బాటిల్… కొత్త రూల్ అమలు చేయబోతున్న జక్కన్న!