వైజాగ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగిన శ్రీకర్ భరత్ ను ఘనంగా సన్మానించనున్న ఏసీఏ..!
TeluguStop.com
భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India Vs England ) మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా శుక్రవారం రెండవ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఇరుజట్లు వైజాగ్ చేరుకొని నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.అయితే భారత జట్టులో ఉండే శ్రీకర్ భరత్ వైజాగ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు.
భారత జట్టు వికెట్ కీపర్, ఆంధ్ర జట్టు కెప్టెన్ గా శ్రీకర్ భరత్ రాణించాడు.
తన హోమ్ గ్రౌండ్ అయిన వైజాగ్ స్టేడియం( Vizag Stadium )లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
తొలి మ్యాచ్లో సత్తా చాటి అద్భుతంగా రాణించాలని అనుకుంటున్నాడు.ఈ క్రమంలో సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రీకర్ భరత్ ను ఘనంగా సన్మానించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించుకుంది.
ఈ సన్మాన కార్యక్రమం నేడు వైజాగ్ స్టేడియంలో నిర్వహించనున్నారు. """/"/
శ్రీకర్ భరత్( Srikar Bharat ) క్రికెట్ కెరియర్ చూసుకుంటే.
ఇతడి జర్నీ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం తోనే ప్రారంభమైంది.2005లో ఈ స్టేడియంలోనే బాల్ బాయ్ గా పనిచేశాడు.
ఇప్పుడు ఇదే స్టేడియంలో తన తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్( International Test Match ) ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఇక సొంత గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా శ్రీకర్ భరత్ నిలవనున్నాడు.
ఈ జాబితాలో ఆంధ్ర దిగ్గజ ప్లేయర్ సీకె నాయుడు మొదటి ఆటగాడిగా ఉన్నాడు.
ఆంధ్ర క్రికెటర్లు భారత్ తరపున టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పటికీ సొంత గడ్డపై ఆడే ఛాన్స్ మొదట సీకే నాయుడుకు ఆ తర్వాత శ్రీకర్ భరత్ కు మాత్రమే దక్కింది.
"""/"/
ఇక ఈ టెస్ట్ సిరీస్( Test Series ) విషయానికి వస్తే.
తొలి మ్యాచ్లో కేవలం 28 పరుగుల తేడాతో భారత్ ఓటమిని చవిచూసింది.ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాలని పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగనుంది.
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?