వైరల్: అదిరిపోయిన షారుఖ్, ఐశ్వర్య రాయ్ పిల్లల స్టేజ్ షో!

ఐశ్వర్య రాయ్‌,( Aishwarya Rai ) షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) గురించి భారతీయ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కాగా వీరిరువురి పిల్లలు ఒకేచోట సందడి చేశారు.అవును, తమ పిల్లల స్కూల్‌ వార్షికోత్సవంలో పాల్గొని వారిని ప్రోత్సహిస్తూ కనిపించారు.

దాంతో ఫాన్స్ పండగ చేసుకున్నారు.ఈ క్రమంలో పిల్లల ప్రదర్శనలు చూసి మురిసిపోయారు.

విషయం ఏమిటంటే, ముంబయిలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో( Dhirubhai Ambani International School ) బాలీవుడ్‌లోని చాలామంది సెలబ్రిటీల పిల్లలు చదువుని అభ్యసిస్తున్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.

గురువారం సాయంత్రం ఆ స్కూల్‌ వార్షికోత్సవం ఘనంగా జరగడంతో ఈ వేడుకల్లో పిల్లల తల్లిదండ్రులు కూడా స్కూలు యాజమాన్యం కోరిక మేరకు పాల్గొనడం జరిగింది.

"""/" / ఈ నేపథ్యంలోనే ఆరాధ్య( Aaradhya ) కోసం అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ కలిసి రాగా, తమ చిన్న తనయుడు అబ్రం( Abram ) కోసం షారుక్‌ ఖాన్‌ కుటుంబం ఇక్కడ సందడి చేసి, మొత్తం ఈవెంటుకే ప్రధాన ఆకర్షణగా మారారు.

ఈ క్రమంలో ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య, షారుక్‌ ఖాన్‌ తనయుడు అబ్రం కలిసి స్టేజ్‌ షో చేయడం విశేషం.

దాంతో దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.కుమారుడిని చూసి షారుక్‌, కుమార్తెను చూసి ఐశ్వర్య - అభిషేక్‌ సంబరపడిపోతూ.

వారి ప్రదర్శనను కెమెరాలో రికార్డు చేస్తూ కనిపించారు.ప్రదర్శన అనంతరం పిల్లలతో కలిసి వీరందరూ డ్యాన్స్‌ చేయడం గమనార్హం.

"""/" / ఇక అభిషేక్‌ బచ్చన్‌ - ఐశ్వర్యరాయ్‌ బచ్చన్ విడాకులు తీసుకోనున్నారు అంటూ కొన్నాళ్ళనుండి మీడియా కోడై కూస్తోన్న సంగతి విదితమే.

ఈ తరుణంలో అమితాబ్‌ బచ్చన్‌ సహా తనయుడు, కోడలు చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్‌లో ఇలా కలిసి కనబడడంతో ఆ రూమర్స్ కి చెక్ పడినట్టు అయింది.

ఇక ఈ వైదికపై అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీ అంతా ఒకసారి ఫొటోలు దిగి, ఆ తరువాత ఐశ్వర్యరాయ్‌, ఆమె కుమార్తె ఆరాధ్య విడిగా కెమెరా ముందుకి వచ్చి అక్కడ ఫోజులు ఇవ్వడం జరిగింది.

ఇకపోతే వారి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా కొంతమంది ఇలాంటి అనవసరం ప్రచారాలు ఎందుకు చేస్తారో అర్ధం కాదని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.

స్విట్జర్లాండ్‌లో గ్రాడ్యుయేషన్ డే .. లెహంగాలో వచ్చిన భారతీయ విద్యార్ధిని