ఒక్క సినిమాతో అయిపోలేదు విజయ్ దేవరకొండ.. ఆయన కామెంట్లే నిజమయ్యాయా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్న సెలబ్రిటీలలో విజయ్ దేవరకొండ ఒకరు.
విజయ్ దేవరకొండ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాపైనా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల విజయాలతో విజయ్ దేవరకొండకు ప్రేక్షకులలో మంచి గుర్తింపు వచ్చింది.
అయితే లైగర్ ఫ్లాప్ కావడానికి పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒకింత కారణమని నెటిజన్లు భావిస్తున్నారు.
పూరీ జగన్నాథ్ నుంచి గొప్ప సినిమాను ఆశించి థియేటర్లకు వెళితే అందుకు భిన్నంగా జరిగిందని నెటిజన్లు ఈ సినిమా గురించి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గతంలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన అభిషేక్ నామా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఆయన గతంలో ఈ కామెంట్లు చేయడం గమనార్హం.
అభిషేక్ నామా ఇండస్ట్రీలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా తీసుకునే శక్తి ఉండాలని అన్నారు.
సినిమాలలో వరల్డ్ ఫేమస్ లవర్ నన్ను చాలా బాధపెట్టిందని ఆ సినిమా ఊహించని డిజాస్టర్ అయిందని ఆయన తెలిపారు.
విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాపైనా రెస్పాండ్ కాకపోవడం మరింత బాధించిందని ఆయన చెప్పుకొచ్చారు.
విజయ్ దేవరకొండకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అని ఆయన ప్రశ్నించారు. """/"/
ఒక్క సినిమాకు విజయ్ దేవరకొండ ఫోన్ స్విఛాఫ్ చేస్తే ఎలా అని అభిషేక్ నామా అన్నారు.
ఇండస్ట్రీలో ఉండే కష్టాలు అన్నీఇన్నీ కావని ఆయన తెలిపారు.దిల్ రాజు గారు చాలామందికి సపోర్ట్ చేశారని అయితే ఆ విషయాలన్నీ మీడియాలో రావని అభిషేక్ నామా వెల్లడించారు.
విజయ్ దేవరకొండ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తన ప్రవర్తనతో విజయ్ దేవరకొండ బాధించడం వల్లే లైగర్ ఫ్లాపైనా ఇండస్ట్రీ నుంచి విజయ్ కు సపోర్ట్ దక్కడం లేదని అభిషేక్ నామా గతంలో విజయ్ ను హెచ్చరించిన విషయాలే నిజమయ్యాయని మరి కొందరు చెబుతున్నారు.
స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ సూపర్ ప్యాక్ ను తప్పక ట్రై చేయండి!