బిగ్ బాస్: అభయ్ నవీన్ నెత్తిపై శని తాండవం చేస్తున్నట్టుంది విడ్డూరం చూస్తుంటే?
TeluguStop.com
బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss Season 8 ) ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది.
మునుపటి సీజన్ కంటే తాజా సీజన్ టిఆర్పి దూసుకెళ్తోంది అని సర్వేలు చెబుతున్నాయి.
ఇప్పటికే రెండు వారాలు విజయవంతంగా పూర్తికాగా, మూడవ వారం కంటిన్యూ అవుతోంది.నామినేషన్ల ప్రక్రియ కూడా మూడవది కావడంతో బుల్లితెర ప్రేక్షకులు చాలా ఆసక్తిగా షో తిలకిస్తున్నారు.
ఈ క్రమంలో కంటెస్టెంట్ నవీన్ ( Naveen )గురించి మాట్లాడుకోవాలి.నవీన్ మొదట్లో బాగా ఆడినప్పటికీ, ఎందుకనో ఇప్పుడు తడబడుతున్నాడు.
చూడబోతే… మెంటల్ మణికంఠగా పేరు తెచ్చుకున్న మణికంఠ( Manikanta ) కంటే కూడా నాసిరకం ఆటను కనబరుస్తున్నాడు.
ఏకంగా బిగ్ బాస్ పైనే అవాక్కులు చవాకులు పేలుస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాడు.
ఇదేగాని కొనసాగితే రాబోయే రోజుల్లో నవీన్ తట్ట బుట్ట సర్దుకొని పోవాల్సి ఉంటుందనే విషయం అందరిని బాధింపక మానదు.
మరోవైపు తోటి కంటెస్టెంట్ నిఖిల్ అందరినీ పలకరించుకుంటూ.నవ్వుకుంటూ సరదాగా గేమ్ ఆడుతున్నాడు.
తోటి వాళ్లను చూసైనా నవీన్ గేమ్ ఆడే తీరు మార్చడం లేదు!. """/" /
ఇప్పుడు ఇదే విషయం నవీన్ అభిమానులను కలచి వేస్తోంది.
దాదాపు నాలుగు రోజులుగా నవీన్ ఆట తీరు బాలేదని, బిగ్ బాస్ తొక్కలో ఆటలు పెడుతున్నాడని అదే పనిగా వాగుతున్నాడు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ పేరు చెప్పకుండా, కంటెస్టెంట్స్ అందరి పైన సీరియస్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
హౌస్ డోర్లు తెరిచి మరి, నచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు.లేనివాళ్లు బయటికి పోవచ్చు! అని వార్నింగ్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.
అయినా నవీన్ ఆట తీరలో ఏమాత్రం మార్పు రావడం లేదు సరి కదా.
తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది.ఇకనైనా నవీన్ ఆటతీరలో మార్పు రాకపోతే చాలా కష్టం అని బుల్లితెర ప్రేక్షకులే బాహాటంగా చెప్పేస్తున్నారు.
"""/" /
అయితే ఇది కూడా ఒక రకమైన డ్రామా కావచ్చు అని కొంతమంది విశ్లేషకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతున్నారు.
కానీ ఏదేమైనప్పటికీ.నామినేషన్ల జాబితాలోని చేరిపోయిన నవీన్ అలా ప్రవర్తించడం ఏనాటికైనా ప్రమాదకరమైన అంశమే అని నవీన్ అభిమానులు భయపడుతున్నారు.
నాని స్టార్ హీరో అవ్వాలంటే ఈ సినిమాలు సూపర్ హిట్ అవ్వాల్సిందేనా..?