అమ్మ కష్టం ఫలించింది.. రూ.22,000 కోట్లు సంపాదించాడు.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే రేయింబవళ్లు ఎంతో కష్టపడాలనే సంగతి తెలిసిందే.పీబీ అబ్దుల్ జెబ్బార్ ( PB Abdul Jebbar )మారుమూల కుగ్రామంలో జన్మించగా బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

అబ్దుల్ కష్టానికి కాలం కలిసొచ్చి 22000 కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి అబ్దుల్ ఎదిగాడు.

కేరళలోని త్రిసూర్ జిల్లాలోని చమక్కలా గ్రామంలో అబ్దుల్ జన్మించారు.ఆరేళ్ల వయస్సులోనే అబ్దుల్ తండ్రి చనిపోయారు.

గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వాళ్ల వస్తువులను కొని లాభాలకు అమ్మడం ద్వారా అబ్దుల్ వ్యాపారం చేసేవారు.

ఆ తర్వాత అబ్దుల్ జబ్బార్ జాబ్ కోసం దుబాయ్ కు వెళ్లారు.దుబాయ్( Dubai ) లో ఇండెంట్ కంపెనీలో మేనేజర్ గా అబ్దుల్ తొలి జాబ్ లోనే మంచి పేరు సంపాదించుకున్నారు.

తర్వాత రోజుల్లో అబ్దుల్ బిజినెస్ లో మెలుకువలను నేర్చుకుని ఆల్ రౌండర్ గా ఎదిగారు.

"""/" / ఆ తర్వాత అబ్దుల్ మజేద్ ప్లాస్టిక్స్ పేరుతో ( Abdul Majed Plastics )బిజినెస్ ను మొదలుపెట్టి ఈ సంస్థ ద్వారా 3500 ఉత్పత్తులను తయారు చేయించారు.

ప్రస్తుతం ఈ సంస్థ టర్నోవర్ 22000 కోట్ల రూపాయలుగా ఉంది.ఆ తర్వాత అబ్దుల్ కేరళలో ఎన్విరో గ్రీన్ క్యారీ బ్యాగ్స్( Enviro Green Carry Bags ) అనే సంస్థను మొదలుపెట్టారు.

ఈ సంస్థ ద్వారా పర్యావరణ అనుకూలమైన కాగితం ఉత్పత్తి జరుగుతుంది.అబ్దుల్ దయా హాస్పిటల్ తో పాటు యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజ్ ను కూడా నడుపుతున్నారు.

"""/" / తన తల్లి వల్లే సక్సెస్ దక్కిందని అబ్దుల్ చెబుతున్నారు.తన సక్సెస్ తల్లికి అంకితమని అబ్దుల్ చెబుతున్నారు.

ఏదైనా కొత్త వెంచర్ ను మొదలుపెట్టడానికి ముందు తల్లి ఆశీస్సులు తప్పకుండా తీసుకుంటానని అబ్దుల్ వెల్లడిస్తున్నారు.

అబ్దుల్ జెబ్బార్ ఎన్నో అవార్డులను అందుకోవడం గమనార్హం.అబ్దుల్ జెబ్బార్ సక్సెస్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అబ్దుల్ టాలెంట్ ను నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.

ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?