Aata Sandeep Jyoti Raj: పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న ఆట సందీప్ భార్య?

తెలుగు ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్ ఆట సందీప్( Aata Sandeep ) ఆయన జ్యోతి రాజ్( Jyoti Raj ) గురించి మనందరికీ తెలిసిందే.

ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో ఆటలో ఫస్ట్ సీజన్ లో విజేతగా నిల్చడంతో అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్ గా స్థిరపడిపోయింది.

ఆట సందీప్ మాత్రమే కాకుండా ఆయన భార్య జ్యోతి రాజ్ కూడా మంచి డాన్సర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

కాగా సందీప్ ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి( Bigg Boss 7 ) కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే.

హౌస్ లో మొదటినుంచి చురుకుగా ఉంటూ 8 వారాలుగా కొనసాగుతూనే ఉన్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన భార్య జ్యోతిరాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది.పల్లవి ప్రశాంత్( Pallavi Prasanth ) సపోర్టర్స్ తమపై చేసిన కామెంట్స్‌పై స్పందించారు.

ఈ సందర్బంగా జ్యోతిరాజ్ మాట్లాడుతూ.రియాలిటీ షో ఆయనకేం కొత్తకాదు.

ఒక్కసారి దిగారంటే కప్పు కొట్టాల్సిందే.బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం.

డ్యాన్స్ వేరు.రియాలిటీ షో వేరు.

సందీప్ ఎవరితోనైనా కలవడానికి కాస్తా టైం తీసుకుంటారు.అతను ఇంట్రావర్ట్.

హౌస్‌లో ఇంతమందిలో కలవాలంటే కాస్తా సమయం పడుతుంది. """/" / మాకు ఒక డ్రీమ్ ఉంది.

అందుకోసమే బిగ్‌బాస్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నాము.తను ఫైనల్‌గా పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలన్నదే ఆశయం అని తెలిపింది జ్యోతి.

తర్వాత పల్లవి ప్రశాంత్‌ సపోర్టర్స్ ట్రోల్స్‌పై( Trolls ) స్పందిస్తూ.ప్రశాంత్‌కు వాళ్లు సపోర్ట్ చేయడం లేదు.

ఇంకా చెడగొడుతున్నారు.మమ్మల్ని ఇంకా హార్ట్ చేస్తూనే ఉన్నారు.

మాపై అసభ్యంగా ట్రోల్స్ చేయడం చాలా తప్పు.ఫ్యామిలీని ఇందులోకి లాగడం మంచిదేనా?.

ఆ విషయంలో నేను వీడియో పెట్టగానే అసభ్యకరమైన కామెంట్స్. """/" / నీ మొగుడు వేస్ట్.

అంటూ చెప్పకూడని మాటలు అన్నారు.షోలో ఉన్నవారి కుటుంబాల గురించి మాట్లాడమేంటి? ప్రశాంత్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.

ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం.నీ మొగుడికి చెప్పు.

ప్రశాంత్‌ జోలికి రావొద్దని.ఇంకా కొన్ని మాటలైతే నేను చెప్పలేనంత అసభ్యంగా మాట్లాడారు.

దానివల్ల ఎవరికీ చెడ్డపేరు.తమ్ముడు ప్రశాంత్‌కే కదా.

అతను లోపలికి వెళ్లేటప్పుడు నాకు సపోర్ట్ చేయండ్రా అని చెప్పేసి వెళ్లాడు.కానీ వీళ్లంతా కలిసి వాడిని ఎలిమినేట్ చేసేలా ఉన్నారు అని తెలిపింది జ్యోతి రాజ్.

కరివేపాకు గాళ్లు మీకే అంతుంటే బన్నీకి బలుపు ఉండడం తప్పులేదు: మాధవీ లత