బిగ్ బాస్ షో ద్వారా సందీప్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
బిగ్ బాస్ షో సీజన్7 ( Bigg Boss Show Season 7 )ఎలిమినేషన్స్ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైంది.
బిగ్ బాస్7 తెలుగులో ఇప్పటివరకు లేడీ కంటెస్టెంట్లు మాత్రమే ఎలిమినేట్ కాగా ఈ వారం ఆట సందీప్( Aata Sandeep ) ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుని సందీప్ ఆడినా ఆయన ఎలిమినేట్ కావడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతుండటం గమనార్హం.
చాలామంది బిగ్ బాస్ హౌస్ నుంచి శోభాశెట్టి( Sobha Shetty ) ఎలిమినేట్ అవుతారని భావించినా అందుకు భిన్నంగా జరిగింది.
ఎనిమిదో వారం తొలిసారి నామినేట్ కావడమే సందీప్ కు మైనస్ అయిందని చాలామంది భావిస్తున్నారు.
మిగతా కంటెస్టెంట్లకు ఓట్లు పడిన స్థాయిలో సందీప్ మాస్టర్ కు పడకపోవడంతో ఆయన ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది.
8 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సందీప్ మాస్టర్ ఉండటం గమనార్హం.
"""/" /
వారానికి 2.75 లక్షల రూపాయల చొప్పున 22 లక్షల రూపాయలు ( 22 Lakh Rupees )సందీప్ కు పారితోషికంగా దక్కిందని సమాచారం అందుతోంది.
చాలామంది కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే ఆట సందీప్ కు బెటర్ రెమ్యునరేషన్ దక్కింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తూ సందీప్ మాస్టర్ ఎలిమినేట్ కావడం గమనార్హం.
సందీప్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
"""/" /
ఆట సందీప్ కు ఎంతో టాలెంట్ ఉందని కెరీర్ పై సరిగ్గా ఫోకస్ పెడితే సందీప్ కు తీరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆట సందీప్ కెరీర్ ఇకపై పుంజుకుంటుందేమో చూడాలి.స్టార్ హీరోల సినిమాలకు పని చేసే ఛాన్స్ వస్తే మాత్రం ఆట సందీప్ కెరీర్ వేరే లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆట సందీప్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
పుదీనాతో ఆశ్చర్యపోయే లాభాలు.. ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా?