జంటగా బిగ్ బాస్ 5కు ఆట సందీప్.. పోల్ తో బయటపడ్డ నిజం!

బుల్లితెరలో త్వరలోనే ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 గురించి ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక అప్ డేట్ వినిపిస్తూనే ఉంది.

ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తి కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ప్రస్తుతం ఐదవ సీజన్ ప్రారంభం కావడానికి పలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కానీ అందులో పాల్గొనేవాళ్ళు ఎవరా అని క్లారిటీ మాత్రం లేదు.ఇదిలా ఉంటే ఈ సీజన్ కు ఆట సందీప్ జంటగా రానున్నట్లు తెలిసింది.

ఇక ఇందులో ఈసారి కూడా సోషల్ మీడియా సెలబ్రెటీలను, బుల్లితెర, వెండితెర నటులను, యాంకర్లను తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఇందులో ఆట సందీప్ పేరు కూడా బాగా వినిపిస్తుంది.

మొదట్లో వీరు జంటగా బిగ్ బాస్ షోకు వస్తున్నారని తెలిసింది.ఇక ఆ తర్వాత ఒక్కరు మాత్రమే వస్తున్నారని అందులో కూడా ఆయన భార్య జ్యోతి మాత్రమే వస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఆట సందీప్ పెట్టిన ఓ పోల్ వల్ల వీరి ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.

తాజాగా ఆయన తన ఫేస్ బుక్ స్టోరీ లో ఓ పోల్ పెట్టాడు.

అందులో తామిద్దరం బిగ్ బాస్ షో లో ఉండాలని, చూడాలని ఎంత మంది అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు.

దీంతో ఆయనకు 83 శాతం మంది ఆ పోలో కు స్పందించగా.మొత్తానికి ఈ పోల్ వల్ల ఆయన తన భార్యతో బిగ్ బాస్ షో లోకి అడుగుపెడుతున్నట్లు అర్థమవుతుంది.

"""/"/ ఇక తాజాగా ఇందులో వి జె సన్నీ, ఆర్ జే కాజల్, లోబో, మానస్, సిరి హన్మంత్, యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్, ఇషా చావ్లా, శ్వేత, నటి ప్రియా, ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్, వర్షిణి, యాని మాస్టర్, బుల్లితెర నటి ఉమా, లహరి, ప్రియాంక, నవ్య స్వామి, యూట్యూబర్ నిఖిల్ పేర్లు ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్గా మారాయి.

ఇటీవలే షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ ఎంట్రీ ఉంటుందా లేదా అని సోషల్ మీడియాలో బాగా వైరల్ టాపిక్ గా మారింది.