ఏపీకి మళ్లీ జగనే సీఎం అని చెప్పిన ఆరా మస్తాన్.. అన్ని స్థానాలతో సంచలనం!

నవ్యాంధ్ర ప్రదేశ్ కు మళ్లీ సీఎం అయ్యేది ఎవరనే ప్రశ్నకు జవాబు దొరికేసింది.

సర్వేలకు సంబంధించి ఎంతో విశ్వసనీయత ఉన్న ఆరా మస్తాన్( AARA Mastan) రాష్ట్రంలో వ్గైసీపీకి విజయం దక్కనుందని వెల్లడించారు.

వైసీపీ 94 నుంచి 104 స్థానాలతో రాష్ట్రంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకోనుందని ఆయన తేల్చి చెప్పారు.

అదే సమయంలో కూటమికి మాత్రం 71 నుంచి 81 స్థానాలే దక్కుతాయని ఆయన వెల్లడించారు.

"""/" / అధికారానికి ఆమడు దూరంలోనే కూటమి ఆగిపోనుందని మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఫలితం మాత్రం దారుణంగా ఉండబోతుందని ఆరా మస్తాన్ సర్వే ఫలితాలతో స్పష్టమైంది.

రాష్ట్రంలో ఏకంగా 49.41 శాతం వోట్ షేర్ తో వైసీపీకి అధికారం సొంతం కానుందని ఇదే సమయంలో కూటమికి 47.

55 శాతం వోట్ షేర్ ఉందని ఈ సర్వేతో తేలింది.ఇతరులకు 3.

04 శాతం వోట్ షేర్ ఉండటం గమనార్హం. """/" / ఏపీలో 54.

75 శాతం స్త్రీలు, 45.35 శాతం పురుషులు వైసీపీకి అనుకూలంగా ఓటు వేయగా కూటమికి కేవలం 42.

01 శాతం మహిళలు మాత్రమే ఓటేశారని ఆరా మస్తాన్ సర్వే లెక్కలు చెబుతున్నాయి.

పురుషులు 51.56 శాతం మంది కూటమికి ఓటు వేసినా మహిళల ఓటు బ్యాంక్ వైసీపీ( YCP )కి ప్లస్ అయింది.

జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆ పార్టీకి శ్రీరామరక్ష అయ్యాయని చెప్పవచ్చు.

ఏపీకి మళ్లీ సీఎం జగనేనని ఆరా మస్తాన్ సర్వే ఫలితాలతో తేలిపోవడంతో జగన్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

క్రెడిబిలిటీ ఉన్న ఆరా మస్తాన్ లెక్కలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో దాదాపుగా నిజమైన నేపథ్యంలో ఏపీలో సైతం అదే జరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

జగనన్న అభిమానుల్లో ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు జోష్ నింపాయని చెప్పవచ్చు.ఈ నెల 9వ తేదీన జగన్( CM Jagan ) మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తేలిపోయింది.

వీడియో: దూడ పుట్టిందని పోలీసులను పిలిచిన రైతు.. ఎందుకో తెలిస్తే…??