గుజరాత్ స్థానిక ఎన్నికలపై ఆప్ దృష్టి

దేశ ప్రదాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ సందర్భంగా అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు తమ తమ అభ్యర్థుల జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి.

మొదటి నుండి గుజరాత్ లో బీజేపీ హవ కొనసాగుతూ వస్తుంది.అందుకు చెక్ పెట్టేందుకు రాజకీయ పార్టీలు తమ తమ కార్యాచరణలో ఉన్నాయి.

ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓ కీలక ప్రకటన చేసింది.గుజరాత్ లో స్థానిక సంస్థలు జరగనున్న నేపథ్యంలో మొదట విడుతగా 504 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.

బి‌జే‌పి పార్టీ కి ప్రత్యామ్నాయ శక్తిగా ఆప్ పార్టీ మారుతుందని ఆ పార్టీకి చెందిన నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు ఆప్ డిల్లీ ఎం‌ఎల్‌ఏ మరియు పార్టీ అధికార ప్రతినిది అతిషి ఆధ్వర్యలో మొదటి విడుత జాబితాను విడుదల చేసింది.

గుజరాత్ లో జరగబోయే స్థానిక సంస్థల స్థానాల్లో ఆప్ పార్టీ అన్నీ స్థానాల్లో పోటీ చేస్తుందని అతిషి అన్నారు.

ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు అసెంబ్లి, పార్లమెంట్ ఎన్నికలోనూ ఆప్ పార్టీ పోటీ చేస్తుందని ఆమె అన్నారు.

బీజేపీ కి బయపడని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేజ్రీవాల్ మాత్రమే అన్నారు.

బీజేపీ పాలన పై దేశ ప్రజలు విసిగిపోయారని అన్నారు.

మెగా ఫ్యామిలీకి దక్కిన సంచలన రికార్డ్ ఇదే.. ఈ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చేయలేరుగా!