గల్ఫ్ కష్టాలు : ఒమన్‌‌లో పంజాబీ అమ్మాయిల దీనగాథ .. సాయానికి ముందుకొచ్చిన ఆప్ ఎంపీ

ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.

ఏదైతేనేం.భారతీయులు( Indians ) ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.

కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.అవసరంలో వున్నవారిని ఆదుకుంటామని చెప్పి టూరిస్ట్ వీసా పేరిట వారిని ట్రావెల్‌ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.

గడువు ముగిసిన తర్వాత వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.

భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని యజమానులు, ట్రావెల్ ఏజెంట్లు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.

ఇంకొందరైతే విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోయి.జైల్లో గడుపుతున్నారు.

కనీసం వీరి క్షేమ సమాచారం కూడా కుటుంబ సభ్యులకు తెలియడం లేదు. """/" / ఇదిలావుండగా.

ఒమన్‌లో( Oman ) కొందరు పంజాబీ మహిళలు ట్రావెల్ ఏజెంట్ల చేతిలో మోసపోయారు.

దీంతో వీరి క్షేమ సమాచారంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో ఆప్ రాజ్యసభ ఎంపీ విక్రమ్ జిత్ సింగ్ సాహ్నీ( MP Vikram Jit Singh Sawhney ) స్పందించారు.

మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో వీరందరినీ తిరిగి స్వదేశానికి తీసుకొస్తానని చెప్పారు.

'విజిట్ అండ్ మెయిడ్ ఎంప్లాయ్‌మెంట్ వీసా'పై అక్కడికి వెళ్లిన పంజాబీ బాలికలు , మహిళలతో వెట్టిచాకిరి చేయించడంతో పాటు వేధింపులు కారణంగా వారు తమ ఉద్యోగాలను వదిలేశారు.

అయితే వీరంతా అక్కడే చిక్కుకుపోయారు. """/" / ఈ విషయం తెలుసుకున్న ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ మస్కట్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్‌తో( Amit Narang ) చర్చించారు.

అంతేకాదు.ఓవర్‌స్టే నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఒక్కొక్కరిపై 1000 ఒమానీ రియాల్స్ (భారత కరెన్సీలో రూ.

2.5 లక్షలు) జరిమానా విధించారని ఎంపీ వెల్లడించారు.

అయితే వీరి జరిమానాతో పాటు భారత్‌కు తీసుకొచ్చేందుకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని విక్రమ్ జిత్ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.

మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం, ప్రపంచ పంజాబీ ఆర్గనైజేషన్, ఒమన్ చాప్టర్, ఒమన్‌లో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని ఎంపీ పేర్కొన్నారు.

కాలు కడుక్కోవడానికి వెళ్తే.. మొసలి కడుపులోకి.. ఇండోనేషియాలో భయానక ఘటన!