వివాదంలో చిక్కుకున్న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా..!

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాదంలో చిక్కుకున్నారని తెలుస్తోంది.ఆయనపై ఫోర్జరీ ఆరోపణలు వెల్లువెత్తాయని సమాచారం.

ఢిల్లీ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో ఎంపీ రాఘవ్ చద్దా ఇతర ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే అనుమతి లేకుండా తమ పేర్లను ఢిల్లీ బిల్లు ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీలో చేర్చారంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కు ఇతర ఎంపీలు ఫిర్యాదు చేశారు.

దీంతో ఎంపీ చద్దానే సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆరోపణ రావడంతో సరికొత్త వివాదానికి తెర తీసింది.

అయితే ఈ ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండిస్తుంది.కావాలనే తమ ఎంపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.