లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్ కస్టడీ పొడిగింపు
TeluguStop.com

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.


ఈ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత సంజయ్ సింగ్ కస్టడీ పొడిగింపు అయింది.


ఈ మేరకు సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 11వ తేదీ వరకు పొడిగించింది.
అయితే అక్టోబర్ 4న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే గంటల సమయం పాటు విచారించిన అనంతరం ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది.
సంజయ్ సింగ్ లిక్కర్ పాలసీలో పలువురు డీలర్లకు లబ్ది చేకూర్చేందుకు లంచాలు తీసుకున్నారని ఈడీ ఆరోపిస్తుంది.
మద్యం మత్తులో రొమాన్స్ తో రెచ్చిపోయిన పోలీస్ అధికారి.. వైరల్ వీడియో