కొడుకు కోసం కలిసిన అమీర్ ఖాన్ -కిరణ్ రావ్ దంపతులు!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు వివాహాలు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తన రెండవ భార్య కిరణ్ రావ్ కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఈ క్రమంలోనే విడాకుల తర్వాత వారి బంధం స్నేహితులుగా కొనసాగుతుందని ప్రకటించారు.ఇలా అమీర్ ఖాన్ వెల్లడించిన తర్వాత వీరిద్దరు పలు సందర్భాలలో       పాల్గోనడం జరిగింది.

అదేవిధంగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా కోసం కిరణ్ రావ్ పని చేశారు.

ఇలా విడాకులతో విడిపోయిన ఈ జంట తన కొడుకు కోసం కలిశారు.ఈ క్రమంలోనే వీరి కొడుకు పుట్టినరోజు కావడంతో అమీర్ ఖాన్ కిరణ్ రావ్ దగ్గరుండి తన కొడుకు చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపారు.

ఈ పుట్టినరోజు వేడుకలలో అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త కూడా పాల్గొన్నారు.

"""/" / ఈ క్రమంలోనే ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.

ఇకపోతే అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రాలకి కూడా కిరణ్ రావ్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా ఈ నెల విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది.

ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా నటించారు.

అదే మరి మన టాలీవుడ్ కి బాలీవుడ్ కి ఉన్న అతిపెద్ద తేడా !