నేను సౌందర్య సోదరుడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది నటీనటులు వచ్చి కొంత కాలం మెరిసి తరువాత కనుమరుగైన వారు ఎంతో మంది ఉంటారు.
కాని సినీ పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయం రెండూ ఉండాలి.అలా ఉన్నవారే సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం నిలబడగలరు.
లేకపోతే అలా వచ్చి ఒక్క సినిమాతోనే వాళ్ళ కెరీర్ ముగించుకొని తిరుగు ప్రయాణం కాక తప్పదు.
ఒకప్పుటి నటులు, నటీమణులు ఇంకా మనకు గుర్తున్నారంటే కారణం వాళ్ళు అందంతో, అభినయాన్ని పలికించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవడమే.
అటువంటి వారి కోవలోకే వస్తారు నటి ఆమని.అయితే ఆమని తాజాగా చావు కబురు చల్లగా అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సందర్బంగా పలు ఇంటర్వ్యూలలో ఆమని రకరకాల విషయాలను వెల్లడించారు.సహజ నటి సౌందర్య, ఆమని మంచి స్నేహితులు.
అయితే అప్పట్లో సౌందర్య సోదరుడు అమర్ ను పెళ్లి చేసుకోమని చెప్పి సౌందర్య తండ్రి ఆమనిని అడిగాడట.
అయితే అప్పుడు ఆమని స్పందించలేదట.ఎందుకంటే సౌందర్య సోదరుడికి ఒక లవ్ ఎఫైర్ ఉందని నాకు తెలుసని, ఆ విషయం సౌందర్య తండ్రికి తెలియక నన్ను అడిగాడని ఆమని చెప్పుకొచ్చింది.
తరువాత హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య, తన సోదరుడు అమర్ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.
అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ .. ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు